ఇప్పుడు యూత్ అంతా కూడా ఒక సినిమా కోసం ఎంతో ఆసక్తిగా .. ఆత్రుతగా ఎదురుచూస్తోంది. యూత్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందిన ఆ సినిమా పేరే ‘డర్టీ హరి‘. ‘వర్షం’ .. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ .. వంటి అందమైన ప్రేమకథలను నిర్మించిన ఎమ్మెస్ రాజు ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించారు. అయితే ఈ సినిమాలో ఆయన పేమకి రొమాన్స్ పాళ్లను ఎక్కువగా జోడించారు. అదే విషయాన్ని ఆయన ట్రైలర్ లో చూపించారు. దాంతో ఈ సినిమా చూడాలనే ఉత్సాహం యూత్ లో అంతకంతకూ పెరిగిపోతోంది.
ఈ సినిమాతో శ్రవణ్ రెడ్డి కథానాయకుడిగా పరిచయమవుతుండగా, ఆయన జోడీగా ‘సిమ్రత్ కౌర్’ మెరవనుంది. కాడమల్లె పువ్వులా కనిపించే ఈ అందాలరాశి, ఇంతకుముందు ‘ప్రేమతో మీ కార్తీక్’ .. ‘పరిచయం’ వంటి సినిమాలు చేసింది. ఆ సినిమాలు అంతగా ఆడకపోయేసరికి ఈ అమ్మాయిని ఎవరూ గుర్తుపెట్టుకోలేదు. ఈ కారణంగా కొంత గ్యాప్ వచ్చినప్పటికీ, ఈ సారి సరైన కథనే ఎంచుకుందనిపిస్తోంది. ఇప్పటికే గ్లామర్ పరంగా అమ్మడికి పొలోమని ఓట్లు పడిపోతున్నాయి. ఈ సినిమాతో ఈ అమ్మాయి క్రేజ్ పెరగడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.
Must Read ;- ‘డర్టీ హరి లో ఉన్నది బూతుకాదు .. శృంగారం!


ఈ నెల 18వ తేదీన ‘డర్టీ హరీ’ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. తాజా ఇంటర్వ్యూలో సిమ్రత్ కౌర్ మాట్లాడుతూ .. “ఇంతకుముందు నేను చేసిన సినిమాలు చూసిన ఎమ్మెస్ రాజుగారు .. నన్ను పిలిపించారు. ఆడిషన్స్ తరువాతనే నన్ను ఆయన ఓకే చేశారు. ఆయన ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన పెద్ద నిర్మాత అని తెలుసుకున్నాను. ఆయన దర్శకత్వంలో చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. సన్నివేశాలను ఆయన వివరించే తీరు నాకు బాగా నచ్చింది.
ఈ సినిమాలో నేను ‘జాస్మిన్’ పాత్రలో కనిపిస్తాను. అందం .. ఆత్మస్థైర్యంతో పాటు బోల్డ్ గా ఆలోచించే అమ్మాయి పాత్ర ఇది. ఇంతకుముందు చేసిన రెండు పాత్రలకు భిన్నంగా ఈ పాత్ర ఉంటుంది. అందువలన ఈ పాత్రను ఒక సవాలుగా స్వీకరించి చేశాను. ఎమ్మెస్ రాజుగారు నటన పరంగా నా నుంచి మంచి అవుట్ పుట్ రాబట్టారు. యూత్ కి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుందని ఆశిస్తున్నాను. కొత్తగా అనిపించే పాత్రలను చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. క్రీడా నేపథ్యంలో సాగే కథల్లో నటించడమంటే నాకు చాలా ఇష్టం” అంటూ తన మనసులోని మాట చెప్పుకొచ్చింది.
ALso Read ;- గ్లామర్ టాప్ లేపిన బోల్డ్ బ్యూటీ పాయల్