ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు ప్రకటించడం పై ఇప్పటికే అటు విపక్షాలతో పాటు ప్రజల్లోనూ అసంతృప్తి ఉంది. మూడు రాజధానులు ప్రకటించినప్పటి నుంచి రాజధాని నగరంలో నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ జగన్ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు.
తాజాగా ‘ద హిందూ ’ గ్రూప్ నకు చెందిన బిజినెస్ లైన్ పత్రిక టుడేస్ పోల్ పేరుతో ఆన్ లైన్ లో మూడు రాజధానుల గురించి ప్రజల అభిప్రాయ సేకరణ జరిపింది. ఇందులో జగన్ మూడు రాజధానుల ప్రణాళిక తెలివైన చర్యేనా? అని పాఠకులను ప్రశ్నించింది. దానిపై ప్రజలను తమ అభిప్రాయలను తెలపాలని కోరింది. అవును, కాదు, చెప్పలేం.. అని మూడు ఐచ్ఛికాలు ఇచ్చింది. ఈ పోల్ కి విశేష స్పందన లభించింది.
నిన్న రాత్రి 9:15 గంటల సమయానికి దాదాపు 4,03,980 మంద స్పందించారు. వారిలో 81 శాతం మంది ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. జగన్ నిర్ణయం తెలివైనది కాదని అభిప్రాయపడ్డారు. 18 శాతం మాత్రమే అది తెలివైన నిర్ణయంగా పేర్కొన్నారు. కేవలం ఒక్క శాతం మంది మాత్రమే ఏమీ చెప్పలేమన్నారు.
ఇప్పటికైనా గుర్తిస్తారా..?
ఒక ఆన్ లైన్ పోల్ లో సుమారు 4 లక్షల మంది పాల్గొనడం అనేది అసాధారణమైన విషయం. ఇది జగన్ తీర్పునకు వ్యతిరేకమైనదనే ప్రజల అభిప్రాయం. ఇంత మంది ప్రజలు వ్యతిరేకత తెలుపుతున్న జగన్ మాత్రం తనకేమి పట్టన్నట్లు, నాకేమి కనబడనట్లు, నాకేమి వినబడనట్లు ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికైనా జగన్ ఈ విషయాన్ని గుర్తించకపోతే భవిష్యత్ లో ఇబ్బందులు పడక తప్పదని ప్రజల పోలింగ్ స్పష్టంగా తెలియజేస్తుంది.