బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్మ చేసుకోవడం.. ఈ కేసు విషయమై సిబిఐ రంగంలోకి దిగడంతో డ్రగ్స్ కోణం బయటపడింది. దీంతో ఈ డ్రగ్స్ వ్యవహారం బాలీవుడ్ ని షేక్ చేసింది. ఈ కేసు విచారణలో సుశాంత్ సింగ్ గర్ల్ ఫ్రెండ్, హీరోయిన్ రియా చక్రవర్తిని, ఆమె సోదరుడు సహా మరికొంత మందిని అరెస్ట్ చేశారు. రియా దాదాపు నెలరోజులు జైలుకే పరిమితం అయ్యింది. తర్వాత ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పి బెయిల్ తెచ్చుకుంది.
అయితే.. కొన్ని కండీషన్స్ మీద కోర్టు రియా చక్రవర్తికి బెయిల్ ఇచ్చింది. బెయిల్ వచ్చినప్పటికీ.. రియా ఇంటికే పరమితమైంది. ఇప్పుడు ఈ అమ్మడు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ టైమ్ పార్టీలో దర్శనమిచ్చింది. రఘురామ్, నాటాలియా డి లుసియో దంపతుల కుమారుడు ఫస్ట్ బర్త్ డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. రఘరామ్ బ్రదర్ రాజీవ్ అండ్ పేరెంట్స్ విజే అనుషా దండేకర్ కూడా ఈ పార్టీలో పాల్గొన్నారు.
రాజీవ్ సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేయడంతో రియా ఈ పార్టీలో పాల్గొన్న విషయం బయటకు వచ్చింది. ఇదిలా ఉంటే.. రియాతో రాజీవ్ ఉన్న ఫోటోను షేర్ చేసి.. మై గర్ల్ అనే క్యాప్షన్ పెట్టడం విశేషం. ఈ ఫోటోను బట్టి రియా నయా బాయ్ ఫ్రెండ్ రాజీవ్ అనే విషయం తెలిసింది. సుశాంత్ సింగ్ ఆత్మహత్య, అలాగే తను డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొన్న తర్వాత రియా చక్రవర్తి పాల్గొన్న ఫస్ట్ పార్టీ ఇదే. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఫిబ్రవరి నుంచి షూటింగ్ లో పాల్గొంటుందని తెలిసింది. అయితే.. ఏ సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది అనేది తెలియాల్సివుంది.
Must Read ;- సమంత విలన్ గా మరో రకం హాట్ గురూ
#RheaChakraborty joins #RaghuRam and #RajivLakshman at a family get-together
Read more: https://t.co/9zwQiJNWMH pic.twitter.com/IiNbL3NIB0
— Indian Express Entertainment (@ieEntertainment) January 8, 2021