సినిమా పరిశ్రమ కి , డ్రగ్స్ కి ఉన్న సంబంధాలపై ఆరోపణలు ఇప్పట్లో తేలేలా లేవు. ఓ రెండు మూడేళ్ళ క్రితం టాలీవుడ్ ని డ్రగ్స్ వివాదం చుట్టుముట్టింది. ఎందరో ప్రముఖులు విచారణకి హాజరయ్యారు. ఎంత ప్రకంపనలు సృష్టిచిందో అంత చప్పగా చల్లారిపోయింది . తాజాగా సుశాంత్ సింగ్ రాజ్ ఫుట్ కేసులో మళ్ళీ డ్రగ్స్ మాట వినిపిస్తోంది. కంగనా రనౌత్ ఇస్తున్న ప్రకటనలైతే బాలీవుడ్ ని వణికిస్తున్నాయి. ఇప్పుడు ఈ డ్రగ్స్ వివాదం శాండల్ వుడ్ (కన్నడ చిత్ర పరిశ్రమ)ని వణికిస్తోంది. కొన్ని రోజుల క్రితం కర్ణాటక నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ డ్రగ్ పెడలేర్స్ పై రైడ్ చేసింది. చాలా మందిని అరెస్ట్ చేశారు. వారి దగ్గర దొరికిన డైరీలో చాలా మంది సినీ నటీనటులు, సంగీత దర్శకుల పేర్లు ఫోన్ నంబర్లు ఉన్నాయి.
తాజాగా కన్నడ బి గ్రేడ్ హీరోయిన్ రాగిణి ద్వివేది బాయ్ ఫ్రెండ్ రవి ని నార్కోటిక్స్ అధికారులు అరెస్ట్ చేశారు. రాగిణికి బాయ్ ఫ్రెండ్ మాట శిలా శాసనం. శ్రీనివాసరాజు డైరెక్ట్ చేసిన కన్నడ ” శివమ్ ” సినిమాలో ఒక హీరోయిన్ గా నటించింది రాగిణి. ఈ సినిమాని తెలుగులో బ్రాహ్మణగా డబ్ చేశారు కూడా. ఉపేంద్ర ఆ సినిమాలో హీరో. తర్వాత శ్రీనివాసరాజు తన దండుపాళ్యం -2 లో రాగిణి హీరోయిన్ గా అనుకుంటే ఓపెనింగ్ షూటింగ్ లో పాల్గొన్న తర్వాత బాయ్ ఫ్రెండ్ సలహా మేరకు ఆ సినిమా వదిలేసింది రాగిణి.
తెలుగులో కూడా కొన్ని భారీ సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నం చేసింది రాగిణి. అయితే వర్కౌట్ కాలేదు. రాగిణి కన్నడ సినిమాల్లో సైతం వాంప్ లేదా బి గ్రేడ్ యాక్షన్ సినిమాలు చేస్తోంది. రాగిణి పేరు బయటికి రావడం, ఆమె బోయ్ ఫ్రెండ్ ని ఈ కేస్ లో అరెస్ట్ చేయడం కన్నడ చిత్ర రంగాన్ని షాక్ కి గురిచేసింది. మరెందరో పేర్లు బయటికి వస్తాయేమోనని కొందరు భయపడుతున్నారు. వరుసగా ఎవరెవరి పేర్లు వస్తాయో అని ఇండస్ట్రీ, మీడియా ఎదురుచూస్తోంది. కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఈ విషయంలో స్పందిస్తూ డ్రగ్స్ కేసులో ఎవరన్నా దోషులని తేలితే వారిని బ్యాన్ చేయం.. కానీ సినిమాల్లో పెట్టుకోము అని తేల్చి చెప్పింది. ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయో చూడాలి.