మహిళలకు డయాబెటిస్
బ్రేక్ఫాస్ట్ మానేసే మహిళలలో టైప్2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందని హార్వర్డ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అధ్యయనంలో తేలింది. దాదాపు 47 వేల మంది మహిళలపై ఏళ్ల తరబడి రీసెర్చ్ చేసి ఈ విషయాన్ని గుర్తించారు. బ్రేక్ఫాస్ట్ మానేయడమే కాదు, చాలా ఆలస్యంగా ఉదయం వేళ అల్పాహారం తీసుకున్నా చేటు చేస్తుంది. దీనివల్ల మేగ్రేన్ తలనొప్పి సమస్య బారిన పడే ప్రమాదముంది. దీర్ఘకాలం దీని ప్రభావం ఉంటుంది.
ఎదుగుదలపై ప్రభావం
టీనేజీ పిల్లలు బ్రేక్ఫాస్ట్ తినకపోతే వారి ఎదుగుదలపై ప్రభావం చూపుతోంది. అల్పాహారం తినే పిల్లలతో పోల్చితే తినని టీనేజర్స్ ఏ విషయంపైనా ఏకాగ్రత చూపలేరు. మంచి ఫలితాలు సాధించలేరట. బ్రేక్ఫాస్ట్ రెగ్యూలర్గా మానేస్తుంటే కొన్ని రోజుల తర్వాత రక్తహీనత సమస్య బారిన పడతాం. ఒకవేళ ఆల్కాహాల్ సేవించిన వారు ఉదయం అల్పాహారం తినకపోతే హ్యాంగోవర్ సమస్య అధికం అవుతుంది. అల్పాహారం మానేస్తే వీరిలో షుగర్ లెవెల్స్ దారుణంగా పడిపోతాయి. మందుబాబులు మీ ఆరోగ్యం కోసం ఇకనైనా ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ కచ్చితంగా చేయక తప్పదు.
మానేస్తే…
తరచుగా బ్రేక్ఫాస్ట్ మానేసే వారిలో జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దాదాపు 10, 12 గంటల తర్వాత శరీరానికి ఇచ్చే ఆహారం అందకపోతే ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. ఉదయం తినకుండా నేరుగా మధ్యాహ్నం తింటే వేగంగా జీర్ణమవుతుంది.
Must Read ;- బాదంలో ఏముంది? పొద్దునే 5 బాదం పప్పులు తింటే!