ఏపీలో వాలంటీర్లపై తాత్కాలిక వేటు పడింది.. వాలంటీర్లు ప్రభుత్వంలో భాగం కాబట్టి వారు విధుల్లో పాల్గొంటే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా.. వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల విధుల్లో తీసుకోవద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు..
అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామస్థాయి కార్యకర్తలు, బూతు లెవల్ నేతలను పట్టించుకోని వైసీపీ అధినేత జగన్.. వాలంటీర్ల వ్యవస్థను నమ్ముకున్నారు.. ఎన్నికలలో వీరి పాత్రే కీలకం కానుందని, తాను ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో కార్యకర్తల అవసరం, నేతల ప్రమేయం ఇక అవసరం ఉండదని ఓటర్లతో తనను కనెక్ట్ చేసి ఓట్లు వేయించేది వాలంటీర్లే అని జగన్ బలంగా నమ్ముకున్నారు.. అయిదేళ్లుగా లీడర్లని పక్కనపెట్టి వాలంటీర్లతోనే ఆయన గేమ్ ఆడారు.. తాజాగా ఆయనకు అసలు నిజం తెలిసి వచ్చింది. కార్యకర్తలు, నేతలే లేకుంటే ఓట్లు రాలవని వైసీపీ అధినేత గ్రహించారు. దీంతో, చేసేది లేక జగన్ వాలంటీర్లతో బండి నడిపించి గట్టెక్కాలని లెక్కలు వేసుకున్నారు..
కార్యకర్తలను దూరం చేసుకున్న వైసీపీ ఎమ్‌ఎల్‌ఏలు, ఎంపీ అభ్యర్ధులు ఫైనల్‌గా వాలంటీర్లను ఆశ్రయిస్తున్నారు.. వారికి తాయిలాలు అందిస్తున్నారు.. తమ నెల జీతం వాలంటీర్లకే ఇస్తామంటూ కొందరు ఎమ్‌ఎల్‌ఏ అభ్యర్ధులు హామీలు గుప్పిస్తుంటే, మరికొందరు వారికి ఈ రెండు నెలలకు భారీగా జీతం ఇచ్చి నియమించుకునేందుకు రెడీ అయ్యారు.. ఇంకొందరు వారిని ఓట్లు కొనుగోలు చేసేందుకు డబ్బు పంపిణీ, తమ గిఫ్టులు పంచేందుకు ఉపయోగించుకుంటున్నారు..
వాలంటీర్లను వైసీపీ నేతలు మభ్యపెడుతున్న చర్యలన్నీ ఎన్నికల సంఘం దృష్టికి వచ్చాయి.. సిటిజెన్స్ ఫోరమ్ ఫర్ డెమొక్రసీతో కొందరు మేథావులు కలిసి చేసిన పోరాటంతో ఓట్ల తొలగింపు, లిస్ట్ మార్చడంలో కొందరు వాలంటీర్ల అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి.. అందుకే, వారిని దూరం పెట్టాలని నిర్ణయించుకుంది ఈసీ. తాజాగా వారికి హెచ్చరికలు కూడా జారీ అవుతున్నాయి.. జగన్ చివరి అస్త్రం కూడా విఫలం అవడంతో జగన్‌కి చుక్కలు కనిపిస్తున్నాయి.. ఓటమి కళ్లముందే కనిపిస్తోంది.. ఇప్పటికే తమ తప్పు తెలుసుకున్న వైసీపీ బడా లీడర్లు వైవీ సుబ్బారెడ్డి, సజ్జల లెంపలేసుకున్నారు.. కార్యకర్తలకి, నేతలకి అన్యాయం జరిగిందని నిజం అంగీకరించారు.. తాజాగా వాలంటీర్లకు కూడా వాతలు పడుతుండడంతో ఏం చేయాలో తెలియక ఆకాశం వైపు చూస్తున్నారు వైసీపీ నేతలు..