ఒకే ఒక్క ట్వీట్.. లక్ష కోట్లను ఆవిరి చేసింది. ప్రపంచ కుబేర కిరీటం చేజారేలా చేసింది. ఇదంతా తనకు తానే చేసుకున్న స్వయకృతాపరాదం. ఎలాన్ మస్క్.. హఠాత్తుగా ప్రపంచ కుబేరుడిగా ఎదిగి అందరి దృష్టిని ఆకర్షించారు. వాట్సప్ ప్రైవసీపై ఎలాన్ చేసిన ట్వీట్ తో యువత వాట్సప్ ప్రత్యామ్నాయాల వైపు చూసేలా చేసింది. ఇప్పుడు కూడా తను చేసిన ఒక ట్వీట్ సంచలనంగా మారింది. కాకపోతే ఇప్పుడు ఈ ట్వీట్ వల్ల నష్టపోయింది వేరే వాళ్లు కాదు.. స్వయంగా ఎలాన్ మస్క్‌కావడం విశేషం. ఒకటి.. రెండు.. కాదు.. ఏకంగా తన సంపదలో లక్ష కోట్లను పోగొట్టుకున్నాడు.. ఇంకేముంది.. ప్రపంచ కుబేరుడి కిటీరం కూడా చేజార్చుకున్నాడు. మరి ఇంతకీ ఎలాన్ చేసిన ట్వీట్ ఏమిటి? దాని వల్ల ఇంత నష్టం ఎందుకు జరిగింది?

అమెరికన్ విద్యుత్ కార్ల కంపెనీ టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ క్రిప్టో కరెన్సీలైన బిట్‌కాయిన్, ఎథర్ విలువ చాలా అధిక స్థాయిలో ఉందంటూ గత వారాంతంలో ట్వీట్ చేశాడు. బిట్‌కాయిన్స్‌లో 150 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేసినట్లు రెండు వారాల క్రితం టెస్లా ప్రకటించింది. అంతేకాదు, త్వరలో బిట్‌కాయిన్ చెల్లింపులనూ స్వీకరిస్తామని తెలిపింది. ఆ కరెన్సీ విలువపై మస్క్ ట్వీట్ చేయడంతో.. సందేహాలు తలెత్తడంతో.. అమెరికా మార్కెట్లో టెస్లా షేరు 8.6 శాతం నష్టపోయింది. గత ఏడాది సెప్టెంబరు తర్వాత టెస్లా షేరుకు ఇదే అతిపెద్ద క్షీణత. దాంతో మస్క్ సంపద 1,520 కోట్ల డాలర్ల (రూ.1.10 లక్షల కోట్లు) మేర పతనమై 18,340 కోట్ల డాలర్లకు పడిపోయింది. దీని ఫలితంగా అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ 18,630 కోట్ల డాలర్ల ఆస్తితో మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్నారు.
Must Read ;- ఫేస్ బుక్, వాట్సప్‌లకు సుప్రీం నోటీసులు..











