విశ్వసనీయ ఖరీదు.. కారాగారవాసమా?
జగన్ రెడ్డిని నమ్మి.. రెండుచేతుల్తో ఓట్లేసి గెలింపించిన ఉద్యోగులు ప్రస్తుతం మూడు చెరువుల నీళ్లను తాగుతున్నారు. రెంటికి చెడ్డ రేవడి మాదిరిగా రాష్ట్ర ఉద్యోగులు నేడు సమన్వయ పాత్రపోషించడంలో తల్లకిందులవుతున్నారు. అటు ఉద్యోగులకు చెప్పుకోలేక, ఇటు ప్రభుత్వాన్ని సంతృప్తి పర్చలేక మధ్య నలిగిపోతున్నారు జేఏసీ నేతలు! ఈ నేపధ్యంలో బుధవారం బండి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభుత్వం మున్ముందు తమను ఎమైనా చేయొచ్చునని, ఇళ్లపై దాడికి కూడా వెనకాడరని వాపోయ్యారు. తమను అరెస్ట్ చేసిన, దాడిచేసిన భయపడేది లేదని చెప్పారు. సమ్మె తమ జన్మహక్కుగా ముందుకెళ్తామని స్పష్టం చేశారు.
రివర్స్ పీఆర్సీ మాకొద్దు..
జగన్ రెడ్డి ప్రకటించిన రివర్స్ పీఆర్సీ తమకొద్దని బండి శ్రీనివాసరావు వెల్లడించారు. తమకు కొత్త జీతాలు వద్దన్నా.. ప్రభుత్వం ఇస్తానంటోందని.. ఇప్పడు ప్రభుత్వం ఇచ్చేది రివర్స్ పీఆర్సీకాక ఏమంటారని నిలదీశారు. 14.29 శాతం ఫిట్మెంట్ ను ఏ పీఆర్సీ ప్రకారం ఇస్తున్నారో చెప్పాలని బండి డిమాండ్ చేశారు. అలానే ఆర్టీసీ ఉద్యోగులపై ప్రభుత్వం చూపుతున్న ఉదాసీనత వైఖరిని తప్పుపట్టారు. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఒక్కటే సమస్య అని, కానీ ఆర్టీసీ ఉద్యోగులకు అన్నీ సమస్యలేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఈహెచ్ఎస్ కార్డులతో ఆర్టీసీ కార్మికులకు వైద్యం అందని పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పటికైన ప్రభుత్వం ఉద్యోగులను చిన్నచూపు చూడటం మాని, చట్టప్రకారం అందించాల్సినవి అందించాలని విజ్ఞప్తి చేశారు.
Must Read:-ఉద్యోగ సంఘాల ఉమ్మడి కార్యాచరణ! ఉద్యోగుల సమావేశానికి అనుమతి నిరాకరణ!!