పూరీ ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీలో ఎనర్జిటిక్ అండ్ అగ్రెసివ్ గూన్ గా మెప్పించి.. బ్లాక్ బస్టర్ అందుకున్న రామ్ పోతినేని.. సంక్రాంతికి వచ్చిన ‘రెడ్’ మూవీతో పరాజయం ఫేస్ చేశాడు. అందులో డబుల్ ఎనర్జీతో నటించినప్పటికీ.. సినిమా రిజల్ట్ తేడా కొట్టింది. అందుకే రామ్ ఈ సారి హిట్ కొట్టేందుకు .. ఎనర్జిటిక్ అండ్ ఎగ్రెసివ్ కాప్ గా నటించ బోతున్నాడట. దర్శకుడు లింగుసామి అవడంతో .. సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి.
‘రన్, పందెంకోడి, పందెంకోడి 2’ సినిమాలతో తెలుగువారినీ మెప్పించిన లింగుసామి.. రామ్ తో తీయబోయే సినిమా కోసం వాస్తవ సంఘటనలతో ఓ కాప్ స్టోరీని సెలెక్ట్ చేసుకున్నడనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల రవితేజ ‘క్రాక్’ సినిమాను గోపీచంద్ మలినేని వాస్తవ సంఘటనల ఆధారంగానే రూపొందించిన సంగతి తెలిసిందే. అసలే ఎనర్జిటిక్ స్టార్ .. అందులోనూ పోలీస్ వేషం.. దీన్ని బట్టి.. ఈ సినిమా కోసం రామ్ ఎలా చెలరేగుతాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
Ram Pothineni And Director Lingusamy Movie :
‘గబ్బర్ సింగ్, పటాస్, క్రాక్’ సినిమాల్లోని పోలీస్ పాత్రల్ని మిక్స్ చేస్తే ఆ పవర్ ఎలా ఉంటుందో రామ్ పొలీస్ పాత్ర అంత పవర్ గా ఉంటుందని చెబుతున్నారు. ఇక ఇందులో కథానాయికగా ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి నటిస్తోంది.అతి త్వరలో రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళనున్న ఈ తెలుగు, తమిళ బైలింగ్విల్ సినిమాలో రామ్ పోతినేని ఇస్మార్ట్ కాప్ గా ఎంతలా చెలరేగుతాడో చూడాలి.
Also Read:అగ్ర దర్శకులు చేతుల్లో కథల కార్ఖానాలు











