Etala Rajendar Hard Comments On CM KCR :
మాజీమంత్రి ఈటల రాజేందర్ అధికార పార్టీ టీఆర్ఎస్‌పై నిప్పులు చెరిగారు. హుజురాబాద్ ఉపప్రచారంలో భాగంగా నెరెళ్లలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు బీజేపీ పార్టీ జెండాలు పీకెయ్యడం తగదని, ఓడిపోతామనే భయంతోనే టీఆర్ఎస్ ప్రభుత్వం చిల్లర పనులకు పాల్పడుతోందని మండిపడ్డారు. హుజూరాబాద్ ఎన్నికలు టార్గెట్‌గా హామీలు ఇస్తుందని, ప్రభుత్వం, అధికార పార్టీ ఎన్ని కుట్రలు చేసినా నియోజకవర్గ ప్రజలు నావెంటే ఉన్నారని అన్నారు. పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని, ఎన్ని డబ్బులు ఖర్చు చేసినా ఏ ప్రయోగాలు చేసినా హుజూరాబాద్ ప్రజలు తన వెంటనే ఉంటారని ఆయన స్పష్టం చేశారు. హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఓటు పదివేల రూపాయలు ఇవ్వడానికి సిద్ధమవుతోందని, డబ్బులు తీసుకొని బీజేపీకే ఓటు వేయాలని ఈటల రాజేందర్ అన్నారు.
దళితుల మీద కపట ప్రేమ
తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినవాళ్లు ఎటు పోయారని, దళితుల మీద కేసీఆర్ కపట ప్రేమను ఎందుకు ప్రదర్శిస్తున్నారని, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న హామీ ఏమైందని, మూడు ఎకరాల భూమి ఎటు పోయిందని, పెన్షన్లు ఏమైయ్యాయి… ? అంటూ కేసీఆర్ పై పరోక్షంగా విరుచుకుపడ్డారు. ‘దళిత బంధు’ పేరుతో దళిత కుటుంబాలకు పది లక్షలిస్తే సంతోషమే. కానీ ఇది కచ్చితంగా మోసపూరిత ప్రకటన అనే విషయం ప్రతిఒక్కరూ గుర్తించుకోవాలని అన్నారు. మంత్రి హరీశ్ రావకు.. తనకు పట్టిన నా గతే పడుతుందని వ్యాఖ్యలు చేశారు. పోలీసులు బీజేపీ నాయకులు, కార్యకర్తల ఫొటోలు తీస్తున్నారని… మేం నక్సలైట్లామా? అని ఈటల రాజేందర్ ప్రశ్నించారు.
Must Read ;- గెలుపే లక్ష్యంగా.. ఈటల అడుగులు