సూపర్ హీరోస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో మార్వెల్ సంస్థకు ఉన్న పేరే వేరు. ఎవెంజర్స్ ఎండ గేమ్ తర్వాత మార్వెల్ కొంత స్పీడు తగ్గించిన మార్వెల్ మళ్లీ విజృంభించబోతోంది. ఇటర్నల్స్ పేరుతో ఓ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు మార్వెల్ సిద్ధమైంది. దీపావళి కానుకగా నవంబరు 5న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఆస్కార్ విన్నింగ్ డైరెక్టర్ క్లోయూ జావ్ రూపొందించిన ఈ సినిమాలో అతిరథమహారథులంతా నటించారు.
ఇంగ్లీషులోనే కాకుండా హిందీ, తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో అనువందించి విడుదల చేయనున్నారు. ఇంతకు ముందు షేంగ్ – ఛీ అండ్ ది లెజెండ్ ఆఫ్ ది టెన్ రింగ్స్ విడుదల చేసింది. ఇప్పుడు ఇటర్నల్స్ ను తీసుకు రాబోతోంది. ఇవికాకుండా డిస్నీప్లస్ హాట్ స్టార్ లోనూ మార్వెల్ దూకుడుగానే ఉంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే మానవ జాతికి శత్రువు డెవియంట్స్ ను ఎదుర్కోవడమే ప్రథాన అంశం.
దీన్ని అమరవీరులంతా కలిసి ఎలా తుదముట్టించారన్నదే కీలకం. కరోనా వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. గత ఏడాది నవంబరు 6న విడుదల కావలసి ఉన్నా కోవిడ్ వల్ల కుదరలేదు. ఈ ఏడాది ప్రథమార్థంలో విడుదల చేయాలనుకుంటే కరోనా సెకండ్ వేవ్ కనికరించలేదు. చివరికి ఈ నవంబరులో తేడీ ఫిక్స్ చేశారు. మార్వెల్ అభిమానుల మనసును ఈ సినిమా దోచుకుంటుందో లేదో చూడాలి.
Must Read ;- నెట్ ఫ్లిక్స్ ద్వారా మలయాళ సూపర్ హీరో