ఎన్. సంజయ్… ఈ పేరు పక్కనే ఐపీఎస్ ట్యాగ్. దళిత సామాజిక వర్గానికి చెందిన పోలీసు అధికారి. మంచిగా చదువుకుని ఉన్నత స్థాయి కొలువును అయితే పొందారు గానీ… విధి నిర్వహణలో మాత్రం తనదైన మార్కు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. అంతేనా… ఆ అక్రమాల పుట్ట ఇప్పుడు పగిలిపోగా.. ఆయన అడ్డంగా దొరికిపోయారు. వెరసి తాను పనిచేస్తున్న పోలీసు శాఖ ద్వారానే అరెస్ట్ కానున్న ఈ పోలీసాయన… ఇక తన మిగిలిన సర్వీసును ఎలా ముగిస్తారు అన్న సందేహాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఐపీఎస్ అధికారిగా వృత్తి జీవితం మొదలుపెట్టిన తొలి నాళ్లలో కరకు అధికారిగానే కాకుండా నక్సలైట్ల పట్ల కఠినంగా వ్యవహరించిన కారణంగా మంచి పేరు తెచ్చుకున్న సంజయ్… ఆ తర్వాత పోలీసు అధికారుల బదిలీల్లో పెద్ద ఎత్తున ముడుపులు స్వీకరించారన్న ఆరోపణలను మూటగట్టుకుని లూప్ లైన్ లోకి వెళ్లిపోయారు.
అయితే వైసీపీ అధికారంలో ఉండగా… జగన్ దృష్టిని ఆకర్షించిన సంజయ్.. ఏకంగా సీఐడీ చీఫ్ గా పదవిని దక్కించుకున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం నారా చంద్రబాబునాయుడును అరెస్ట్ చేయడంలో సంజయ్ కీలకంగా వ్యవహరించారు. చంద్రబాబును అరెస్ట్ చేయడంతో పాటుగా ఆయనను ఏకంగా జైలుకు తరలించేలా వ్యూహం రచించిన సంజయ్… చంద్రబాబు అరెస్ట్ సక్రమమేనని జనాన్ని ఒప్పించడంలో మాత్రం ఘోరంగా విఫలమయ్యారు. ఈ క్రమంలో ఏకంగా దేశ రాజధాని ఢిల్లీకి నాటి అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకరరెడ్డితో కలిసి వెళ్లి… అక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ నేషనల్ మీడియా ముందు ఆయన ఎంతగా అభాసుపాలయ్యారన్న విషయం ఇప్పటికీ ఏపీ జనానికి గుర్తుండే ఉంటుంది. మీడియా అడిగిన ప్రశ్నలకు ఏమీ తెలియని వెర్రి వెంగళప్పల మాదిరిగా సంజయ్, పొన్నవోలు చేసిన సైగలు జనానికి కామెడీని పంచాయి.
సరే…అదంతా అలా ఉంచితే… తన సొంత సామాజిక వర్గం ఎస్సీలతో పాటు ఎస్టీలకు చట్టాలపై అవగాహన కల్పిస్తానంటూ ఓ భారీ బాధ్యతల్లోకి దిగిపోయిన సంజయ్… నాటి జగన్ సర్కారు నుంచి ఏకంగా రూ.1 కోటిని విడుదల చేయించుకున్నారట. ఇందులో ఆయన కేవలం రూ.3 లక్షలు మాత్రమే ఖర్చు చేాశారట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రభుత్వానికి నివేదించారు. మరి మిగిలిన రూ.97 లక్షలు సర్కారీ ఖజానాకు జమ చేయాలి కదా. అలాంటిదేమీ ఖజానాలో కనిపించలేదు. దీంతో ఈ వ్యవహారంపై కాస్తంత కూపీ లాగగా… ఎలాంటి కష్టం లేకుండానే సంజయ్ లీలలు బయటపడిపోయాయట. అయినా ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం ఖర్చుచేస్తానంటూ నిధులు విడుదల చేయించుకోవడం వరకు బాగానే ఉన్నా… తన సొంత సామాజిక వర్గానికే మోసం చేస్తూ సంజయ్ ఇలా దాదాపుగా కోటి రూపాయలను తన జేబులో వేసుకున్న తీరుపై సర్వత్రా విమర్శలు రేగుతున్నాయి.
ఇదిలా ఉంటే… సంజయ్ సహా చాలా మంది ఐపీఎస్ అధికారులు వైసీపీ జమానాలో నాటి ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు నడుచుకున్నారు. నాటి ప్రభుత్వ పెద్దలు ఏం చేయమంటే అదే చేశారు. తాము ఆలిండియా సర్వీసులకు చెందిన అధికారులమని, తమకు ఓ రూల్ బుక్ ఉంటుందన్న విషయాన్ని కూడా వారు మరిచిపోయారు. ఇలాంటి వారిలో సంజయ్ కూడా ఒకరు. ఈ కారణంగానే కాబోలు కూటమి సర్కారు వచ్చినప్పటి నుంచి సంజయ్ కి ఎక్కడ కూడా పోస్టింగ్ లభించలేదు. కొందరిపై ఇప్పటికే కేసులు నమోదయ్యేందుకు రంగం సిద్ధం కాగా… తాజాగా అడ్డంగా దొరికిపోయిన సంజయ్ పై ారి కంటే ముందుగానే కేసు నమోదయ్యే అవకాాశాలున్నాయి. ఇప్పటికే రిటైర్మెంట్ కు దగ్గరపడ్డ సంజయ్ కి ఇక పోస్టింగ్ దక్కడం కూడా కష్టమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.