విజయనగరం జిల్లా మంత్రి, ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు తనయుడు రవి.. చంద్రబాబుని కలవడం వైసీపీని షేక్ చేస్తోంది.
అప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల వేడి రాజుకుంది, సార్వత్రిక ఎన్నికలకి ఇంకా సంవత్సరం సమయం ఉన్న అప్పుడే అన్ని పార్టీలు తమ ఆయుధాలకి పని పెడుతున్నారు, ఎత్తులు పైఎత్తులు వేస్తూ ప్రత్యర్థికి నిద్ర లేకుండా చేస్తున్నారు. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి
తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు తనయుడు బూడి రవి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఈ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో షేక్ అవుతున్నాయి. ఎన్నికలకు ముందు జగన్ డిప్యూటీ సీఎం తనయుడు చంద్రబాబుతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఒకప్పుడు టీడీపీకి కంచు కోటగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన సీనియర్ నాయకుడు బుడ్డి ముత్యాలనాయుడు. అయితే 2019లో ఎన్నికలో ఈ ప్రాంతంలో జగన్ వైసీపీ భారీ ఆధిక్యాన్ని సాధించింది.
అయితే ఇప్పుడు తాజా సమీకరణాలను పరిశీలిస్తే.. డిప్యూటీ సీఎం తనయుడు స్వయంగా టీడీపీ అధినేతను కలవడం ప్రజల మూడ్‌లో మార్పుకు సూచనగా చెప్పవచ్చు. డిప్యూటీ సీఎం కొడుకు ఉద్దేశ్యం లేకుండా CBNని కలవడు కదా అంటున్నారు. ఎన్నికలకు ముందు టీడీపీలోకి వెళ్లేందుకు ముత్యాలనాయుడు తన కుమారుడిని సీబీఎన్‌ని కలవడానికి పంపే అవకాశం ఉందని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. అలాంటప్పుడు ఎన్నికల ముందు ప్రత్యర్థి పార్టీ తరపున డిప్యూటీ సీఎం ఓడిపోవడం జగన్‌కు దిక్కవుతుంది. ఇదంతా ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు సమక్షంలోనే జరుగుతుందని, పార్టీ మారె ఆలోచన ఉంది కాబట్టి సొంత కొడుకును చంద్ర బాబు దగ్గరికి పంపాడని తెలుస్తోంది, అదే కనుక జరిగితే వైసీపీ శ్రేణ్ణులో అసంతృప్తి ఎమ్మెల్యేలు, మంత్రులు టీడీపీలోకి వరుస కట్టే అవకాశం ఉంది.