టీడీపీ సీనియర్ నేత , మాజీ మంత్రి నారాయణ పై అయన తమ్ముడి భార్య ప్రియ చేసిన విమర్శలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి . ఏపీలో మరో తొమ్మిది నెలల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో నారాయణపై ఆరోపణలు తెరపైకి రావడంతో ఏపీలో కలకలం రేగింది. అయితే ప్రియ ఇప్పటి వరకు చేయని ఆరోపణలు ఎన్నికలు జరగబోతున్న సమయంలోనే ఎందుకు చేశారు.. దీని వెనుక ఏదైనా రాజకీయ కోణం ఉందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి .. అంతేకాదు ఆమె ఏకంగా 13 నిమిషాల వీడియో విడుదల విడుదల చేయడంతో ఇందులో కుట్ర కోణం ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ..అంతేకాదు ఆమె చేసిన ఆరోపణలు సైతం వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయి ..
నారాయణ తమ్ముడి భార్య ప్రియ వీడియోలో మాట్లాడుతూ .. గత కొంత కాలంగా తనను ఎన్నో రకాలుగా టార్చర్ చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. తమ్ముడి భార్య అని కూడా చూడకుండా డేగలా తనపై కన్నేశారని, చిత్ర హింసలు పెడుతూ పైశాచిక ఆనందం అనుభవిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియో పోస్ట్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
ఇంట్లో తన భార్య ఉండగానే.. అర్థరాత్రి వేళ అన్నం తీసుకురాలేదని తనను చిత్ర హింసలు పెట్టి కొట్టాడని.. నానా మాటలు అన్నాడని వాపోయింది. నవ్వుతూ వీడియో ప్రారంభించిన ప్రియ.. తర్వాత ఏడుస్తూ ముగించింది.. అంతేకాదు ఈ వీడియోలో మోసపోయిన పిట్టను తనేనని అంటూ వ్యాఖ్యనించారు.
అయితే అసలు వాస్తవం వేరేలా ఉన్నట్టు స్పష్టం అవుతుంది .. నారాయణ తన తమ్ముడి భార్య అయిన ప్రియకు నారాయణ విద్యాసంస్థల్లో కీలక భాద్యతలు ఇచ్చారు .. నారాయణ కుమారుడు నిషిత్ ఆరేళ్ళ క్రితమే రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు ..కొడుకు దూరమైన బాధలో నారాయణ కొన్ని బాధ్యతలని ఇతర కుటుంబ సభ్యులకి ఇచ్చారు .. తమ్ముడు మణి, అయన భార్య ప్రియలకి కీలక బాధ్యతలు ఇచ్చారు ..అదే సమయంలో ఆయన బాధ్యతలకు దూరం అయ్యారు . ఇదే అదనుగా ప్రియ భారీ స్కామ్ కి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తుంది . ఇష్టా రాజ్యాంగ వ్యవహరించి మోసాలకు పాల్పడినట్టు తెలుస్తుంది .. బావగారు పెద్దగా శ్రద్ద పెట్టకపోవడం .. ఇదే సమయంలో తమ చేతిలో సంస్థలు ఉండటంతో ఇదే అదనుగా రెచ్చిపోయినట్టు తెలుస్తుంది .. కోట్ల రూపాయల స్కామ్ చేసినట్టు తెలుస్తుంది ..
ఇక తాజాగా నారాయణ సంస్థ గురించి పలు నిజాలు తెలుసుకున్నట్టు సమాచారం
ఈ క్రమంలో ప్రియ చేసిన మోసాలు , స్కామ్ లు నారాయణకు తెలిశాయి …దీనిపై ఆమెని నిలదీసినట్టు తెలుస్తుంది ..అంతేకాక బాధ్యతల నుంచి తప్పించినట్టు సమాచారం.. ఇక తన గుట్టు రట్టు అవడంతో ఆమె కొత్త నాటకానికి తేరా తీసినట్టు తెలుస్తుంది .. ఇందులో భాగంగానే కట్టు కధలు అల్లినట్టు తెలుస్తుంది . తన భగోతం బయటపడుతుందనే భయంతో బయటకి వచ్చి ఇలా ఎటాక్ మోడల్;యూ పెట్టినట్టు సమాచారం ..దీని వెనుక నారాయణ ప్రత్యర్ధులు కూడా ఉన్నారని తెలుస్తుంది .. త్వరలోనే అసలు నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది ..