తెలంగాణ సీనియర్ రాజకీయవేత్త, మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ రావు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ బెయిల్ రద్దు కావడం ఖాయమని, త్వరలోనే జగన్ జైలుకు వెళ్తారని గోనె తనదైన శైలి జోస్యం చెప్పారు. గతంలో జగన్ తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి ముఖ్య అనుచరుడిగా కొనసాగిన గోనె… ఇప్పుడు ఏపీలో జగన్ నేతృత్వంలో సాగుతున్న పాలనపై తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. అక్రమాస్తుల కేసులో జగన్ ప్రస్తుతం బెయల్ పై ఉన్న సంగతి తెలిసిందే. ఈ బెయిల్ ను రద్దు చేయాలంటూ వైసీపీకే చెందిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఏకంగా సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణపై అటు ఏపీతో పాటు ఇటు తెలంగాణలోనూ ఆసక్తికర చర్చ సాగుతోంది.
పులివెందులలోనే ప్రెస్ మీట్ పెడతా
ఇలాంటి నేపథ్యంలో శుక్రవారం తిరుమల వచ్చిన గోనె ప్రకాశ్ రావు… ఏపీలో జగన్ సాగిస్తున్న పానలపై నిప్పులు చెరిగారు. ఏపీలో సంక్షేమాన్ని పక్కకు పెట్టిన సీఎం జగన్… అక్రమ అరెస్టులు, కేసులతో అరాచక పాలన కొనసాగిస్తున్నాడని గోనె సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ అవినీతిని, వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే మీడియాపై కేసులు పెడుతున్నారని కూడా గోనె ఆరోపించారు. జగన్ అభిమానులు తనపై కవ్వింపు చర్యలకు దిగుతున్నారని, కొన్నిరోజులుగా తనను బెదిరిస్తున్నారని ఆయన మరింత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ తరహా బెదిరింపులకు తాను భయపడేది లేదని తెగేసి చెప్పారు. అవసరమైతే… జగన్ సొంతూరు పులివెందులలో ప్రెస్ మీట్ పెట్టగలనని కూడా గోనె చెప్పారు. ఇకనైనా జగన్ అభిమానులు బెదిరింపులు మానుకోవాలని, లేదంటే… జగన్ అసలు స్వరూపం ఎంటో బయట పెడతానని గొనె ప్రకాశ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
Must Read ;- అవినీతిపరుల కోసం జగన్ కొత్త పథకం : అచ్చెన్నాయుడు