తప్పుడు కేసులకు తాను భయపడనని, వైసీపీ నాయకుల అవినీతిపై పోరు ఆపనని ఆసుపత్రి నుంచి విడుదల చేసిన వీడియోలో అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు.తనపై కక్ష పూరితంగా అక్రమ కేసు పెట్టి అరెస్టు చేశారన్నారు. ఆ కేసు పూర్వాపరాలు ఆయన మాటల్లోనే…
అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి నాపై అక్రమంగా కేసులు పెట్టించారు..
రెండు నెలల క్రితం మా బావ, మా అక్క భర్త తేతలి సత్తిరాజురెడ్డి హార్ట్ ఎటాక్‌తో మరణించారు. 2003 నుంచి మా కుటుంబానికి, సత్తిరెడ్డి కుటుంబానికి సంబంధంలేకుండా దూరంగా ఉంటున్నాం. దానిని అవకాశంగా తీసుకుని అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి నాపై అక్రమంగా కేసులు పెట్టిoచి అరెస్ట్ చేయించారు, నాపై కక్ష సాధింపుకు ప్రయత్నం చేస్తున్నారు. సత్తిరాజురెడ్డి జనవరి18, 2012న బలభద్రపురం – బిక్కవోలు కెనాల్ రోడ్‌లో మత్స్య క్షేత్రం వద్ద మరణించిన తరువాత మృతదేహాన్ని మా కుటుంబానికి అప్పగించకుండా సంబంధంలేని ఒక ఉప్పుడుగత్తెకు అప్పగించారు. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా భర్త ఇంకొక మహిళను భార్యగా చూడటం ఏ చట్టం ప్రకారం అంగీకరిస్తుందన్న విషయం పోలీసులు తెలుసుకోవలసిన అవసరం ఉంది. సత్తిరాజురెడ్డి హార్ట్ ఎటాక్‌తో మరణిస్తే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం రిపోర్ట్‌లో ఆయన హార్ట్ ఎటాక్‌తో మరణించారని స్పష్టంగా ఉంటే దానిని విజయవాడలో ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్‌లో రిపోర్ట్‌ను మార్చి, ఇప్పుడు సెక్షన్ 306గా మార్చి మా మావయ్య, నాపై కేసు నమోదు చేశారు. నాపై కేసు నమోదు చేసి దౌర్జన్యంగా అరెస్ట్ చేశారు.వాటన్నింటిపై న్యాయస్థానాన్ని ఆశ్రయంచి నిజానిజాలు నిగ్గు తేలుస్తాం.
అధికారులు, పోలీసుల వత్తాసు
అధికారులు, పోలీసులు అధికార వైసీపీ నాయకులకు వత్తాసు పలుకుతూ నాపై అక్రమంగా కేసు పెట్టి అరెస్ట్ చేశారు. మీరు ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టినా వెనకడుగు వేసేదిలేదు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా బెయిల్‌పై వచ్చి వైసీపీ నాయకుల అవినీతి, అక్రమాలను తెలుగుదేశం పార్టీ తరుఫున ఎండగడతామని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి తెలిపారు.
Must Read ;- అక్రమ కేసులు ఎత్తివేయకపోతే ఆందోళన.. అచ్చెన్నాయుడు