మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఆయన బీజేపీలో చేరుతారా? లేక సొంత పార్టీ పెడతారా? అనే ప్రచారం బాగా జరిగింది. ఈ నేపథ్యంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి మీడియా ముందుకొచ్చి షాకింగ్స్ కామెంట్స్ చేశారు. రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్ రావుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇద్దరూ తనకు ఇష్టమైన నేతలు అన్నారు. తక్కువ మాట్లాడతారు, ఎక్కువ వింటారని చెప్పుకొచ్చారు. కేసీఆర్, కేటీఆర్ తప్పుకుని, టీఆర్ఎస్ నాయకత్వాన్ని వాళ్లకు ఇస్తే, మళ్ళీ టీఆర్ఎస్‌లో చేరతానన్నారు. ఈటెలతో మాట్లాడే ప్రయత్నం చేశానని, అపాయింట్ మెంట్ కూడా అడిగానని, ఫ్లోన్ల ట్యాపింగ్ భయంతో మాట్లాడటానికి భయపడతున్నారన్నారు. ఈటల రాజేందర్ ప్రభుత్వంపై కామెంట్స్ చేస్తున్నారని, నిజంగా టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేది ఉంటే వచ్చేయండన్నారు. ఈటల సొంత పార్టీ ఏర్పాటు చేస్తే గొప్ప నాయకుడు అవుతాడని జోస్యం చెప్పారు. తాను సొంత పార్టీ పెట్టనని స్పష్టం చేశారు.
Must Read ;- రేవంత్, విశ్వేశ్వర్‌రెడ్డి జట్టు కడతారా.. కొత్త పార్టీ పెడతారా..?