విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ఎఫ్ 3’. బిఫోర్ లాస్టియర్ సంక్రాంతి కానుకగా విడుదలై.. బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న ‘ఎఫ్ 2’ చిత్రానికిది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. అవే పాత్రలతో వేరే కథతో రూపొందుతోన్న ఈ సినిమా కథాంశం డబ్బు చుట్టూ తిరుగుతుందట. ఈ నేపథ్యంలో హిలేరియస్ కామెడిని వర్కవుట్ చేస్తున్నాడట దర్శకుడు అనిల్. సునీల్ మరో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమా ఇప్పటికే పలు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది. ఈ క్రమంలో ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ను మైసూర్ లో ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది.
‘ఎఫ్ 3’ సినిమాను ఆగష్ట్ 27న విడుదల చేయబోతున్నారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా పెరుగుతోన్న కేసుల దృష్ట్యా పలు చిత్రాలు విడుదల తేదీల్ని వాయిదా వేసుకున్నాయి. మరికొన్ని సినిమాలు ఈ లిస్ట్ లోకి చేరబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎఫ్ 3 సినిమాని కూడా వాయిదా వేస్తారేమో అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఈ సినిమాను ఎట్టి పరిస్థుతుల్లోనైనా ముందుగా ఖాయం చేసిన రిలీజ్ డేట్లోనే విడుదల చేస్తారట. ఆ మేరకు షూటింగ్ ను శరవేగంగా కంప్లీట్ చేస్తున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఇక ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఏప్రిల్ 15న అంటే రేపే మొదలు పెట్టబోతున్నారు. మరి ‘ఎఫ్ 3’ మూవీ అనుకున్న టైమ్ లోనే విడుదల అవుతుందో లేదో చూడాలి.
Must Read ;- శరవేగంగా వెంకీ ‘దృశ్యం 2’ చిత్రీకరణ
Looking forward to another fun schedule with the team 🙌! #HappyUgadi#F3Movie#F3OnAug27th@IAmVarunTej @AnilRavipudi @tamannaahspeaks @Mehreenpirzada @ThisIsDSP @SVC_official pic.twitter.com/uby6jO2enY
— Venkatesh Daggubati (@VenkyMama) April 13, 2021