విక్టరీ వెంకటేష్ – మెగా హీరో వరుణ్ తేజ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఎఫ్ 3. సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఎఫ్ 3 కూడా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం అనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. డిసెంబర్ లో షూటింగ్ ప్రారంభించిన ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
సంక్రాంతికి రిలీజ్ చేసిన సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించడం.. కేంద్రప్రభుత్వం 50 శాతం సిటింగ్ కెపాసిటిని పెంచనుందని వార్తలు వస్తుండడంతో సినిమాలను రిలీజ్ చేసేందుకు నిర్మాతల ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. వరుసగా సినిమాలు రిలీజ్ డేట్ లు ఎనౌన్స్ చేస్తుండడంతో టాలీవుడ్ లో సినిమాల సందడి స్టార్ట్ అయ్యింది. నాగచైతన్య లవ్ స్టోరీ, నాని టక్ జగదీష్, అల్లు అర్జున్ పుష్ప, వరుణ్ తేజ్ ఘని, రానా విరాటపర్వం.. తదితర చిత్రాలు రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేశాయి.
ఇప్పుడు ఎఫ్ 3 మూవీకి సైతం విడుదల తేదీ ఖాయం చేశారు. ఈ మూవీని సమ్మర్ లో రిలీజ్ చేయాలి అనుకున్నారు. అయితే.. షూటింగ్ ఇంకా కంప్లీట్ కాకపోవడం.. సమ్మర్ కి రానున్న సినిమాలు ఆల్రెడీ డేట్ ఫిక్స్ చేసుకోవడంతో ఎఫ్ 3 మూవీని ఆగష్టు 27న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ట్విట్టర్ వేదిక గా ప్రకటించారు. లాస్టియర్ సంక్రాంతికి సరిలేరు నీకవ్వరు మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న అనిల్ రావిపూడి.. ఎఫ్ 3 ఏ రేంజ్ లో హిట్టు కొడతాడో చూడాలి.
Must Read ;- అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఎనర్జిటిక్ హీరో!
Mark this date and lock your time to get entertained !!#F3OnAug27th pic.twitter.com/MZDB8Topkz
— Anil Ravipudi (@AnilRavipudi) January 28, 2021