అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఫేస్ బుక్ గట్టి షాక్ ఇచ్చింది. రాబోయే రేండేళ్లు ఫేస్ బుక్‌లో ఆయన మనోభావాలు పంచుకోవడానికి వీలు లేకుండా చేసింది. రెండేళ్ల పాటు మీ సేవలు మాకు అవసరం లేదంటూ ఫేస్ బుక్ యాజమాన్యం ట్రంప్‌కు సమాచారం ఇచ్చింది. ఈ ఏడాది జనవరి 6వ తేదీన అమెరికా క్యాపిటల్‌పై దాడులు జరగక ముందు ట్రంప్ ఫేస్ బుక్‌లో పోస్టులు చెయ్యడం, అవి అల్లర్లు వ్యాపించడానికి కారణం అయ్యాయని ఫేస్ బుక్ యాజమాన్యం అప్పట్లోనే ఆరోపించి ఆరు నెలలు నిషేధం విధించింది. తాజాగా దానిని రెండేళ్లకు పొడిగించారు. అయితే ఆయన ఫేస్ బుక్ చూసుకోవచ్చు కాని ఎలాంటి పోస్టులు పెట్టడానికి అవకాశం లేదు.
Must Read ;- శభాష్ బైడెన్ : మాటలు తక్కువ, పని ఎక్కువ, అమెరికా ఊపిరి పీల్చుకో ఇక!











