గ్రేటర్ ఎన్నికల వేళ బీజేపీ నేతలకు కొత్త తలనొప్పులు వస్తున్నాయి. గ్రేటర్ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తరువాత రోజు నుండే నేతలకు ఇబ్బందులు తప్పడం లేదు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వరద సాయం ఆపాలంటూ ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసాడంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన ఓ లేఖ ఇప్పటికీ వారిని వెంటాడుతోంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆ లేఖ సంజయ్ రాయలేదని స్పష్టం చేసినా ఇప్పటికీ అధికార పార్టీ ఆ లేఖనే ప్రధాన ప్రచారస్త్రంగా వినియోగించుకుంటోంది. దీంతో బండి సంజయ్ ప్రజల్లో నమ్మకం కలిగించేందుకు భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు వచ్చి ప్రమాణం చేయాలంటూ సీఎంకు సవాల్ విసిరారు.
Also Read:-సీఎంకు సవాల్ విసిరిన బండి సంజయ్.. పాతబస్తీలో టెన్షన్.. టెన్షన్!
సంజయ్‌ని ప్రచార కమిటీ నుండి తప్పించారంటూ..
ఇక బండి సంజయ్‌నే టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం హోరెత్తుతోంది. నిన్న బండి సంజయ్‌ని ప్రచార కమిటీ నుండి తప్పించారని … ఇక గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొనబోరంటూ ఓ ట్వీట్ నిన్న స్కర్క్యులేట్ అయ్యింది. దీనిపైనా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ సాగింది. నిజంగానే ఆయనను తప్పించారా అంటూ ప్రశ్నల వర్షం, అనుమానాలు వ్యక్తం చేశారు చాలా మంది. అయితే ఈ ప్రచారాన్ని బీజేపీ నేతలు లైట్ తీసుకున్నారు. బీజేపీ అధ్యక్షుడు చేస్తున్న ప్రచారానికి సమాధానం ఇవ్వలేక ఇలా దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శిస్తున్నారు ఆ పార్టీ నేతలు. తాజాగా ఆయన బీజేవైఎం సమావేశానికి హాజరై అందరి అనుమానాలను పటాపంచలు చేశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ని ఎందుకు ప్రచారం నుండి తప్పిస్తారని.. ఆయన చేసిన ప్రసంగాలు, సవాళ్ళతో అధికార టీఆర్ఎస్ పూర్తి స్థాయిలో ఇరుకున పడుతోందని.. ఆయన ప్రచారానికి పార్టీకి ప్రజల నుండి మంచి స్పందన వస్తోందన్నారు.
Also Read:-త్వరలో బీజేపీకి కన్నా గుడ్ బై ?
ఫేక్ అన్న రాజాసింగ్, డీకే అరుణ
ఇక గోషామమల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అకౌంట్ నుండి కూడా ఓ ట్వీట్ వచ్చింది. బండి సంజయ్ తన అనుచరులకు టికెట్ ఇవ్వలేదని.. దీంతో తాను చాలా నారాజ్‌లో ఉన్నానని ఆ ట్వీట్ సారాంశం. అయితే, ఆ వెంటనే అలర్ట్ అయిన రాజాసింగ్ ఆ ట్విట్ ఫేక్ అంటూ వివరణ ఇచ్చుకున్నారు. తన అకౌంట్‌ను ఎవరో హ్యాక్ చేసి ఇలా ట్వీట్ చేశారని తెలిపారు. ఇక ఈరోజు ఉదయం కూడా సంజయ్ పేరుతో ఓ ట్వీట్ కలకలం రేపింది. ఈ సారి డీకే అరుణ పార్టీ మారుతున్నారని.. బీజేపీ అరుణకు ఎన్నో అవకాశాలు ఇచ్చిందని .. పార్టీ మారడం దురదృష్ట కరమని ట్వీట్ సర్క్యూలేట్ అయ్యింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి డీకే అరుణతో బేటీ అయ్యి ఆమె కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు ఒప్పించారని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఇది కూడా ఫేక్ అని .. ఉత్తంకుమార్ రెడ్డికి తన దగ్గరకు వచ్చే ధైర్యమే లేదని తెలిపారు డీకే అరుణ. ఇలాంటి ఫాల్స్ వార్తలను ఎవరు ప్రచారం చేస్తున్నారో తనకు తెలుసని … ఉత్తంకుమార్ రెడ్డి చెంచానే ఇవన్ని చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు డీకే అరుణ.