ఆయన అన్నట్లుగా సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న వీడియాలపై అచ్చెన్నాయుడు స్పందించి ట్విటర్లో వారికి ఘాటుగా సమాధానం ఇచ్చారు. నువ్వూ.. నీ దొంగ సాక్షి ఎన్ని తప్పుడు వీడియోలు వేసినా టీడీపీలో విభేదాలు సృష్టించలేవు జగన్‌రెడ్డి. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుగారి నాయకత్వంలో తిరుపతి ఎన్నికకు ఐకమత్యంగా పనిచేస్తుండడంతో నీకు ఓటమి భయం పట్టుకుంది. నారా లోకేష్ విసిరిన సవాల్‌కి తోక ముడిచావు. నిన్న బాబుగారి సభపై రాళ్లేయించావు. ఈ రోజు నా సంభాషణల్ని వక్రీకరించావు. ఎన్ని విష పన్నాగాలు పన్నినా తెలుగుదేశం విజయాన్ని ఆపలేవు. నారా లోకేష్‌తో నాకున్న అనుబంధాన్ని విడదీయలేవు.
Must Read ;- వైసీపీ ప్యాక్షన్ రాళ్లు ఆయన్ను భయపెట్టలేవు.. నారా లోకేష్
నిన్న బాబుగారి సభపై రాళ్లేయించావు. ఈ రోజు నా సంభాషణల్ని వక్రీకరించావు. ఎన్ని విషపన్నాగాలు పన్నినా తెలుగుదేశం విజయాన్ని ఆపలేవు. నారా లోకేష్‌తో నాకున్న అనుబంధాన్ని విడదీయలేవు. (2/2)@ysjagan
— Kinjarapu Atchannaidu (@katchannaidu) April 13, 2021