ఓటరుల్లారా.. బహుపరాక్.. ఓటమి భయంతో దొంగ ఓట్లు..!
భారత రాజ్యాంగాన్ని, హక్కులను జగన్ రెడ్డి కాలరాస్తున్నారు. అడ్డదారుల్లో అందలం ఎక్కాలని వైసీపీ చేస్తున్న కుట్రలు అన్నీ ఇన్నీ కావన్నది వాస్తవం. నకిలీ ఓట్లును సృష్టించి ఎన్నికల నియమావళిని అపహస్యం చేస్తున్నారు.
చేవ, సిగ్గులేని క్రాస్ బ్రీడ్ పొలిటిషన్స్ కు కేవలం అరాచకం మాత్రం తెలుసు..! ఈ కోవలో వైసీపీకి చెందిన ఆ అధినేత అండ్ కో దీనికి అర్హులు. అధికారాన్ని, స్థానిక అధికారులను అడ్డంపెట్టుకుని నకిలీ ఓట్లును సృష్టిస్తున్న తీరు ఆందోళనకు గురిచేస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. 175 నియోజకవర్గాలు వేలకొద్దీ నకిలీ ఓట్లు నమోదు ప్రక్రియ వేగవంతం జరుగుతోంది. జిల్లా స్థాయి ఉన్నతాధికారులే ఇందుకూ ప్రత్యక్ష పాత్ర పోషిస్తున్నారు. రాజ్యాంగ స్పూర్తిని అపహస్యం చేసేలా నకిలీ ఓట్లు చేర్పు ప్రక్రియలో జిల్లా ఉన్నతాధికారులే ప్రత్యక్షంగా ఇన్వాల్ అవుతుంటే.. తమ ఓటు హక్కును కాపాడుకునేందుకు సగటు ఓటరుకు దిక్కెవరు..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ ఓట్లు నమోదు ప్రక్రియ వేగవంతం చేసింది జగన్ పార్టీ. అనుకూలమైన పార్టీ కార్యకర్తలకు సంబంధించిన డోర్ నెంబర్లు వేసి ఎడాపెడా వేలల్లో నకిలీ ఓట్లును సృష్టి జరుగుతోంది. ఈ కుట్రలను గుర్తించిన తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతిఘటిస్తున్నారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి… దొంగ ఓట్ల లెక్క నిగ్గు తెేల్చుతున్నారు. దీంతో విచారణ చేపట్టిన ఎన్నికల సంఘం 15 లక్షల పైగా ఫేక్ ఓట్లను నిబంధనలకు విరుద్ధంగా నమోదు చేయడం జరిగిందని గుర్తించి, వాటిని పోయిన జూన్ నెలలో తోలగించింది. అంత పెద్ద ఎత్తున ఫేక్ ఓట్ల నయోదు ప్రక్రియ జరగడం…, వాటిని గుర్తించడం, తొలగించడం వంటిది దేశం చరిత్రలోనే ఇదే తొలిసారి. స్వేచ్ఛా, స్వతంత్రంగా ఓటు వేసే పరిస్థితి కూడా సామాన్య ఓటరుకు లేదా..? అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా అనంతపురం జిల్లాలో కేంద్ర ఎన్నికల సంఘం కోరడా ఝుళిపించింది. తెలుగు దేశం సానుభూ తిపరుల ఓట్లు తొలగింపు, నకిలీ ఓట్లు నమోదు ప్రక్రియను సాక్ష్యత్తు జిల్లా పరిపరిషత్ సీఈవో భాస్కర్ రెడ్డి నిర్వహించడం సిగ్గుచేటు. ఆయన కనుసన్నల్లో వేలకొద్దీ నకిలీ ఓట్లు నమోదు ప్రక్రియ జరిగిందని ఎన్నికల సంఘం విచారణ తేల్చింది. సస్పెండ్ చేయమని ఆదేశాలిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం కాపాడుకునే ప్రయత్నంలో కాలయాపన చేసింది. ఎట్టకేలకు ఢిల్లీ ఈసీ వత్తిడితో సస్పెన్షన్ వేటు వేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సెంట్రల్ ఈసీ చర్యలే ప్రస్తుతం ఏపిలోని అన్నీ జిల్లాలోని ఉన్నతాధికారులు మెడకు ఊరితాళ్ళు కానున్నాయి. అధికారపార్టీ అండదండలతో జీరో డోర్ నెంబర్ పై ఓట్లును నమోదు చేయడం చర్చగా మారింది. వీటన్నీంటిని వెలికి తీసి, ఓటరు హక్కును కాపాడే బాధ్యతను తెలుగుదేశం పార్టీ తీసుకుంది. ఈ కుట్రలను గుర్తించిన టీడీపీ నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదుల పరంపరను కొనసాగిస్తున్నారు. గత ఏడాది నుంచే ఏపీలోని 175 నియోజకవర్గాల్లో ఈ నకిలీ ఓట్లు నమోదు ప్రక్రియ జరుగుతోందన్నది వాస్తవం. అందుకు జూన్ నెలలో రద్దు అయిన 15 లక్షల నకిలీ ఓట్లే సాక్ష్యం. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ దొంగట్లు నమోదుపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తన నియోజకవర్గంలోనే దాదాపు 6 వేల నకిలీ ఓట్లను చేర్చడంతో పాటు ఉన్న ఓట్లను తొలగించడంపై ఫిర్యాదు చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పూర్తి విచారణ చేపట్టి.. రిటర్నింగ్ అదికారిగా ఉన్న జిల్లా పరిషత్ సీఈవో భాస్కర్ రెడ్డిని సస్పెండ్ చేసింది. అయితే ఈ నకలీ ఓట్లు నమోదు ప్రక్రియలో వైసీపీకి చెందిన ఓ కీలక నేత కుమారుడి పాత్ర కీలంగా ఉన్నట్లు తెలుస్తోంది