చంద్రబాబునాయుడు అరెస్టు తో తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి కార్యకర్తల వరకూ సంబంధిత పనుల్లో బిజీగా ఉండగా ఏపీలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఓట్లు భారీ ఎత్తున తొలగించేందుకు కుట్ర మళ్లీ మొదలైంది. అధికార వైసీపీ వారు వాలంటీర్ల నుంచి అనధికారికంగా సేకరించిన డేటాను ఉపయోగించి ఓటర్లకు నోటీసులు పంపుతున్నారు.
స్థానికంగా నివాసం ఉండడం లేదని, ఓటు ఉన్న బూత్ పరిధిలో నివాసం లేరని… ఇలా రకరకాల కారణాలతో పలువురికి నోటీసులు వస్తున్నాయి. వీరిలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వారే ఉంటున్నారు. ఇలా తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులకు చాలా గ్రామాల్లో పోస్టల్ శాఖ నుంచి ఇటీవల నోటీసులు వస్తున్నాయి.
ఏపిలో దొంగ ఓట్లపై ఇప్పటికే జాతీయ స్థాయిలో దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. ఫారం 6, ఫారం 7 వినియోగించి దొంగ ఓట్లను చేర్చడం, తెలుగుదేశం పార్టీ ఓట్లను తీసేయడం నిరంతరాయంగా అధికార వైసీపీ చేస్తున్నదనే ఆరోపణలు తెలుగుదేశం పార్టీ నుంచి వస్తూనే ఉన్నాయి. అయినా వైసీపీ ఏ మాత్రం సిగ్గు పడకుండా అదే పని చేస్తూనే ఉన్నది.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఈ దొంగ ఓట్ల విషయాన్ని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ దొంగ ఓట్ల వ్యవహారంపై దాదాపు 9 నెలల పాటు పోరాడి ఇద్దరు ఉన్నతాధికారులను సస్పెండ్ చేయించారు. అక్రమాలకు పాల్పడిన కింది స్థాయి ఉద్యోగులు కూడా సస్పెండ్ అయ్యారు.
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఏపీలో భారీగా దొంగ ఓట్లు ఉన్నాయని జూన్ లో ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఎంపీ రఘురామ లేఖకు బదులిచ్చింది. దొంగ ఓట్ల తొలగింపునకు చర్యలు చేపట్టామని ఈసీ తెలిపింది. ఏపీలో 27,13,443 దొంగ ఓట్లు ఉన్నట్లు గుర్తించామని ఎన్నికల సంఘం వెల్లడించింది. జీరో ఇంటి నెంబర్ తో 2,51,767 ఓట్లు ఉన్నాయని, ఒకే డోర్ నెంబరుపై పది అంతకు మించి ఓట్లు ఉన్న ఇండ్లు 1,57,939 అని ఎన్నికల సంఘం తెలిపింది. ఒకే డోర్ నెంబరు కలిగిన ఓట్లు 24,61,676 ఉన్నట్టు గుర్తించినట్లు ఈసీ పేర్కొంది.
తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో దొంగ ఓట్లపై మళ్లీ దృష్టి సారించాలని తెలుగుదేశం పార్టీ పిలుపునిస్తున్నది. తెలుగుదేశం పార్టీ నాయకులు, BLA లు, క్లస్టర్ మరియు యూనిట్ ఇంచార్జ్ లు వెంటనే స్పందించాలని తెలుగుదేశం పార్టీ కోరుతున్నది.
మీ గ్రామాలలో ఎవరెవరికి పోస్టల్ నోటీసులు వస్తున్నాయో ఎంక్వైరీ చేయండి. మీ ఊరికి వచ్చే POST MAN ను కూడా అడిగి తెలుసుకోండి. అలాంటి నోటీసులను తీసుకొని, BLO ను సంప్రదించండి. ఎందుకు నోటీసులు ఇచ్చారో తెలుసుకోండి అంటూ తెలుగుదేశం పార్టీ తన కార్యకర్తలను హెచ్చించింది.