అనంతలో నిలిచిన నీటి సరఫరా..
హంద్రీనీవా కాలువకు నీటి సరాఫరా నిలిచిపోయింది. దీంతో తమ పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళనకు దిగారు. అనంతపురం జిల్లా ఉరవకొండ వద్ద అనంతపురం – బళ్లారి జాతీయ రహదారిపై బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. హంద్రీనీవా నీటి కోసం వారం రోజులుగా రైతులు పోరాటం చేస్తున్నా.. అధికారులు కనీసం స్పందించడం లేదు. హంద్రీనీవా కాలువకు నీటి సరఫరా నిలిచిపోవడంతో చేతికొచ్చిన పంటలు ఎండిపోతున్నాయి. అలానే నీటి సరాఫరా నిలిచిపోవడంతో తాగునీటికి తీవ్ర కటకటలాడుతోందని ప్రజలు అవేదన వ్యక్తం చేస్తున్నాయి.
రోడ్డెక్కిన రైతులు..
అనంతపురం జిల్లాలో హంద్రీనీవా కాలువకు నీటి సరఫరా నిలిచిపోడంతో రైతులు రోడ్డెక్కారు. అనంపురం జిల్లా ఉరవకొండ వద్ద అనంతపురం – బళ్లారి జాతీయ రహదారిపై బైఠాయించి, నిరసన వ్యక్తం చేశారు. హెచ్ఎల్సీ నుంచి హంద్రీనీవా కు నీటిని మళ్లించి, తమను ఆదుకోవాలని రైతులు కోరారు. ఈ నేపథ్యంలో జాతీయ రహదారిపై ఆందోళన చేస్తున్న రైతులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తలించారు. సమస్యను పరిష్కరించకపోతే.. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడతామని హెచ్చరించారు. అరెస్టైన రైతులను తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పరామర్శించారు. హంద్రీనీవా నీటి కోసం వారం రోజులుగా రైతులు పోరాటం చేస్తున్న స్పందించకపోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు. హందీనీవా కాలువను నమ్ముకుని వేల ఎకరాల్లో వ్యవసాయం చేస్తుంటే ఎటువంటి మందస్తు సమాచారం లేకుండా నీటిని నిలిపివేయడం ఏమిటని పయ్యావుల మండిపడ్డారు.
Must Read:-అమరావతిలో జగన్ సర్కార్ అలజడి! వ్యతిరేకించిన రైతులు!!