మెగాస్టార్ చిరంజీవి తన జీవిత కాలంలో ఎందరో టెక్నీషియన్స్ తో వర్క్ చేశారు. వారిలో కొందరితో ఆయన ఇప్పటికీ మంచి రిలేషన్స్ మెయిన్ టెయిన్ చేస్తున్నారు. అలాంటి వారిలో సంగీత దర్శకుడు మణిశర్మ చాలా ముఖ్యులు. ఒకప్పుడు చిరు, మణిశర్మ కాంబో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. చిరంజీవికి డ్యాన్సుల పరంగా సరికొత్త స్టెప్స్ వేయడానికి ప్రేరణనిచ్చిన ట్యూన్స్ అవి. అందుకే ఇప్పుడు మరోసారి మెగాస్టార్ ‘ఆచార్య’ కోసం మణిశర్మను రికమెండ్ చేయడం టాలీవుడ్ లో చర్చనీయాంశమైంది.
అంతేకాదండోయ్.. చిరు మణిశర్మ కొడుకు మహతీ స్వరసాగర్ ను కూడా మెహర్ రమేశ్ తో చేయబోయే కొత్త సినిమా కోసం రికమెండ్ చేశారట. వేదాళం రీమేక్ వెర్షన్ అయిన ఈ సినిమాకి మహతి స్వరసాగర్ ట్యూన్స్ అందించబోతున్నట్టు తెలుస్తోంది. ఛలో , భీష్మ సినిమాలకు మహతి సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇలా.. ఇటు తండ్రితోనూ, అటు కొడుకుతోనూ చిరంజీవి వర్క్ చేయనుండడం అందరినీ ఆకట్టుకుంటోంది.
అసలు చిరు .. తండ్రీ కొడుకులతో వర్క్ చేసే కాన్సెప్ట్ ఇప్పటిది కాదు. ఒకప్పుడు కూడా ఇది కనిపిస్తుంది. అప్పట్లో చిరంజీవి నటించిన ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు కథ మాటలు అందించారు జి.సత్యమూర్తి. తర్వాత ఆయన తనయుడు సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ తో కలిసి వర్క్ చేశారు చిరంజీవి. వీరిద్దరి కలయికలో శంకర్ దాదా సిరీస్, ఖైదీనెం. 150 సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. చిరంజీవి నటించిన ఎన్నో సినిమాల్లోని పాటలకు అదిరిపోయే కొరియోగ్రఫీ అందించారు సుందరం మాస్టారు. ఆ తర్వాత ఆయన తనయులైన ప్రభుదేవా, రాజు కూడా చిరంజీవికి అద్భుతమైన కొరియోగ్రఫీ అందించారు.
ఇక చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ అయిన ఖైదీ నెం.150 కి కూడా ఇలాంటి విశేషమే యాడ్ అయింది. అదేంటంటే.. ఈ సినిమాలో రెండు పాటలకు శేఖర్ మాస్టర్ డ్యాన్స్ కంపోజ్ చేశారు. ఆ రెండు పాటలూ సెన్సేషన్ హిట్టయ్యాయి . అయితే ఆ తర్వాత శేఖర్ మాస్టర్ తనయుడు విన్నీ .. ‘సైరా నరసింహారెడ్డి’లో చిరంజీవితో కలిసి నటించిన సంగతి తెలిసిందే. సో.. మొత్తం మీద మెగాస్టార్ కి .. తండ్రులతోనే కాదు.. కొడుకులతో కూడా ఓ ప్రత్యేకమైన బాండింగ్ ఉందన్నమాట. మరి మణిశర్మ, మహతి మెగాస్టార్ కు ఏ రేంజ్ లో ఆల్బమ్స్ అందిస్తారో చూడాలి.