జై భీమ్ చిత్రం చిత్రం మరోసారి వివాదం లో చిక్కింది.ఓ వర్గంకు చెందిన వారిని తక్కువ చేసి చూపారంటు ఓ వ్యక్తి కోర్టు ను ఆశ్రహించాడు. కోర్టు ఆధేశాల మేరకు చిత్ర హీరో సూర్య పై పోలీసులు కేసు నమోదు చేశారు.తొలుత రుద్ర వన్నియర్ సేన వ్యవస్థాపకుడు సంతోష్ ఈ చిత్రం పై అభ్యంతరం వ్యక్తం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ పోలీసులు కేసు నమోదు చేయలేదు.
పోలీసులకు ఫిర్యాదు చేసిన కేసు నమోదు చేయకపోవడం తో సదరు వ్యక్తం కోర్టు కు ఆశ్రయించారు. దీనితో కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు హీరో సూర్య, నిర్మాతగా వ్యవహరించిన జ్యోతిక, దర్శకుడు టీజే జ్ఞానవేల్ పై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు..
ఇది ఇలా ఉండగా చిత్రం విడుదల విషయం లో కూడా హీరో సూర్య, చిత్ర యూనిట్ అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. వాటన్నింని ఎదుర్కొని చిత్రాన్ని విడుదల చేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి లో గుర్తింపు వచ్చింది. ఈ సమయం లో చిత్రం లో ఓ వర్గం వారిని తక్కువ చూపారని ఆరోపణలు రావడంతో పాటు కోర్టుకు వెల్లడం, కసు నమోదు కావడంతో జై భీమ్ చిత్రం మరోసారి వార్తల్లో నిలిచింది.
చిత్ర పరిశ్రమలో సినిమాల పై ఏదోఒక వివాధం తెర పైకి వస్తుంది. చిన్నసినిమాలే కాదు పెద్ద సినిమాలకు ఈ తిప్పలు తప్పడం లేదు. అందులో భాగంగా జైభీమ్ చిత్ర పై ఓ వివాదం తెరమీదకు వచ్చింది. గతం లో వచ్చిన సమస్యలను అధిగమించి ప్రేక్షకుల ఆధరణ పొందిన ఈ చిత్రం పై ఎఫ్ఐఆర్ నమోదు కావడం తో అభిమానులు ప్రేక్షకులు అవాక్కయ్యారు. అయితే కొందరు తమ పబ్లిసిటీ కోసం ఇలా చేస్తున్నారని ఆరోపణలు లేకపోలేదు.
ఇంత జరిగినా హీరో సూర్య ఎలా స్పందిస్తారు అన్నది మాత్రం తెలియదు. కాగా గతం కూడా ఈ చిత్రం పై వివాదాలు తలెత్తగా సూర్య స్పందించారు. ఎవ్వరిని అవమానించడం, కించపరడం లేదని సమాధానం ఇచ్చారు. తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు కావడం తో చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తారో ని ప్రేక్షకులు వేచిచూస్తున్నారు. ఏది ఏమైనా ఈ చిత్రం సమాజానికి ఓ మంచి సందేశాన్ని ఇచ్చింది. ఇటువంటి చిత్రానికి ఇలా అండ్డంకులు రావడాన్ని అభిమానులు జీర్ణించుకోవడం లేదు.