అన్నపూర్ణ స్టూడియోలో శుక్రవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది వెళ్లి మంటల్ని ఆర్పివేశారు. అగ్నిప్రమాదం వార్తలో ఎలాంటి నిజం లేదని స్టూడియో యాజమాన్యం అంటోంది. అవాస్తవాలను ప్రచారం చేయవద్దని ట్విట్టర్ ద్వారా కోరింది. షూటింగ్ కోసం వేసిన సెట్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఆస్తి నష్టం కూడా పెద్దగా జరగలేదని అంటున్నారు. అగ్ని ప్రమాదం నేపథ్యంలో అన్నపూర్ణ ఏడెకరాల స్టూడియోలో బిగ్‌బాస్ సెట్ కూడా ఉంది. దాంతో అక్కడ ఉన్నవారిలో కొంత ఆందోళన నెలకొంది.
అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతానికి కుడివైపున బిగ్‌బాస్ హౌస్ ఉంది. మంటలు అదుపులోకి రావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. బిగ్‌బాస్ నిర్వహణకు ఎలాంటి ఇబ్బందీ లేదని సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం గురించి ఆరా తీస్తున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ స్టూడియోలో 2017 నవంబరులో కూడా అగ్నిప్రమాదం జరిగింది. అప్పుడు ‘మనం’ సినిమా కోసం వేసిన సెట్ లో ఈ ప్రమాదం జరగింది.
ఇది తప్పుడు వార్త : నాగార్జున
అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్ని ప్రమాదం జరిగిందనడంలో నిజం లేదని అక్కినేని నాగార్జున అన్నారు. ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. అంతా బాగుందని, అక్కడ ఏమీ జరగలేదని ఆయన పేర్కొన్నారు.
There are some articles in the media that there has been a major fire At Annapurna Studios this morning… Not to worry this is WRONG NEWS and everything is absolutely fine👍😊
— Nagarjuna Akkineni (@iamnagarjuna) October 16, 2020
All is well at Annapurna!
.
.
Request to refrain from spreading unconfirmed news🙏🏽— Annapurna Studios (@AnnapurnaStdios) October 16, 2020











