విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్, కరణ్ జోహార్, చార్మ్ కౌర్ పాన్ ఇండియా ఫిల్మ్ పేరు LIGER (సాలా క్రాస్ బ్రీడ్)గా కన్ ఫర్మ్ అయిపోయింది.
టాలీవుడ్ యంగ్ హీరోల్లో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ సినిమా ఫస్ట్ లుక్ వచ్చేసింది. బ్యాగ్గౌండులో పులి తలతో విజయ్ దేవరకొండ పక్కా మాస్ లుక్ తో కనిపించాడు. LIGER – సాలా క్రాస్ బ్రీడ్ అనే ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు. బాక్సర్ గా విజయ్ కనిపించాడు. లయన్, టైగర్ కలిస్తే లిగర్ అయిందట.పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, తెలుగు .. హిందీతో పాటు ఇతర భాషల్లోనూ విడుదల చేయనున్నారు.పూరి జగన్నాధ్ ఈ ప్రతిష్టాత్మక పాన్ ఇండియా ప్రాజెక్టుతో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు.
పూరి కనెక్ట్‌లతో కలిసి, బాలీవుడ్‌లోని ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సాలా క్రాస్‌బ్రీడ్ అనే ట్యాగ్‌లైన్‌తో లైగర్ పేరు నిర్ణయించారు. ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. విజయ్ దేవరకొండను పొడవాటి జుట్టుతో గ్లోవ్స్‌తో మార్షల్ ఆర్టిస్ట్‌గా చూపించారు. సింహం, పులి కలగలిసిన రూపంగా ఈ లుక్ ఉంది. లైగర్ అనేది ఒక హైబ్రిడ్ రకం పులి. మగ సింహం, ఆడ పులితో సంభోగం చేస్తే లైగర్ పుడుతుందట. టైటిల్ విచిత్రంగా అనిపిస్తుంది కదూ. ఈ పోస్టర్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
ఈ సినిమాతో తెలుగు తెరకి ‘అనన్య పాండే’ పరిచయం కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి టైటిల్ తో కూడిన ఫస్టులుక్ పోస్టర్ ను ఈ ఉదయం రిలీజ్ చేశారు. ఇంతకుముందు ఈ సినిమా పేరును ఫైటర్ గా నిర్ణయించినా ఇప్పుడు లైగర్ అని పేరును నిర్ణయించారు. టైటిల్ ఎందుకు మార్చారోగానీ ఫైటర్ కన్నా పవర్ ఫుల్ గానే ఉంది.
హీరో విజయ్ ను విభిన్న అవతారాలలో చూపించే ప్రయత్నం చేస్తున్నట్టు అర్థమవుతోంది. పూరి జగన్నాధ్ ఇంతకుముందెప్పుడూ ఇలాంటి గెటప్‌కు ప్రయత్నం చేయలేదు. ఫస్ట్ లుక్ పోస్టర్లో విజయ్ పొడవాటి జుట్టుతో స్టయిలిష్ గా ఆకట్టుకున్నాడు. పాన్ ఇండియా చిత్రం కావడంతో ధర్మ ప్రొడక్షన్స్ ఈ ప్రాజెక్టుతో కలిసింది. దీనికి విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ అందించారు. పూరి జగన్నాధ్, చార్మ్ కౌర్, కరణ్ జోహార్, అపుర్వ మెహతా కలిసి ఈ చిత్రాన్ని బ్యాంక్రోలింగ్ చేస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో నటి రమ్య కృష్ణ ఓ కీలక పాత్రను పోషిస్తోెంది.
ఇంతకుముందు విజయ్ దేవరకొండ చేసిన ‘డియర్ కామ్రేడ్’ .. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలు, భారీ అంచనాల మధ్య విడుదలయ్యాయి .. అదే స్థాయిలో నిరాశపరిచాయి. దాంతో ఈ సారి హిట్ కొట్టడమనేది తప్పనిసరి అయింది. ఎందుకంటే రేసులో వెనకబడిపోకుండా ఉండాలంటే విజయ్ దేవరకొండకి ఈ సినిమా హిట్ చాలా ముఖ్యమైనదనే చెప్పాలి. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమా ఇది రూపొందుతోంది.
Must Read ;- పేరులో నేముంది కాదు.. పూరి పంజా పేరులోనే ఉంది
Humbly announcing our arrival Pan India!
Nation wide madness Guaranteed.
Produced by @KaranJohar @DharmaMovies @Charmmeofficial @PuriConnects
A @purijagan Film!#LIGER#SaalaCrossBreed pic.twitter.com/GWrLKuLrJu
— Vijay Deverakonda (@TheDeverakonda) January 18, 2021