ఏపీలో ‘ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ’ వాళ్లు ఇచ్చే నివేదికల ప్రకారమే పెద్దలు నిర్ణయాలు ఉంటున్నట్లు తెలుస్తోంది. దీంతో అధికారుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు వాళ్లను చూస్తూనే వణికి పోతున్నారు. పరిస్థితి ఎలా ఉందంటే..
కలెక్టర్ ఆఫీసులో ..కలెక్టర్ గారు బిజీగా ఉన్నారు. ఇంతలో అటెండర్ ఓ కార్డు తెచ్చి ఇచ్చాడు.. కలెక్టర్ వెంటనే హడావుడిగా.. ‘‘లోపలకి పంపండి‘‘ అంటూ ఆదేశమిచ్చారు.వెంటనే ఇద్దరు మనుషులు వచ్చారు. వారిని చూస్తూనే కలెక్టర్ గారు లేచి నిలబడి నమస్కరించి.. ‘‘సార్ వాళ్లకు కాఫీ పట్టుకు రా‘‘ అంటూ ఆర్డరేశాడు. ‘‘ఏంటి సార్ సంగతులు.. ఈ కరోనాలో జాగ్రత్తగా ఉండాలి మీరు‘‘ అంటూ కుశల ప్రశ్నలు వేస్తున్నాడు. వచ్చినోళ్లు మీడియా వాళ్లు కాదు..మంత్రిగారి మనుషులు కాదు.. ఏసీబీ, సీఐడీ వాళ్లు అంతకన్నా కాదు.. అయినా ఈ కలెక్టర్ ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకు చేస్తున్నట్లు..? చీఫ్ సెక్రటరీ ఎదురుగా ఉన్నట్లే బిల్డప్ ఇస్తున్నాడేంటి? ఏదో సీఎంగారి మనుషులు వచ్చినట్లు టెన్షన్ పడుతున్నాడేంటి? ఇలా రకరకాల ప్రశ్నలు వేధిస్తుంటే.. ఆ అటెండర్ కాఫీ తెచ్చి ఇచ్చాడు.
‘‘వాళ్లెవరూ మన మాట వినడం లేదు.. తీసేయండి’’
వచ్చినవాళ్లు కాఫీ తాగాక ఓ పేపర్ కలెక్టర్‌కి ఇచ్చి ‘‘వాళ్లెవరూ మన మాట వినడం లేదు.. తీసేయండి’’ అని చెప్పారు. ‘‘మరీ ఇంతమందిని తీసేస్తే పనికి ఇబ్బంది అవుతుందేమో.. నేను అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ వాళ్లకు చెప్పి తీయించేస్తా’’అంటూ వినయంగా చెప్పాడు కలెక్టర్. వాళ్లు సరే అని వెళ్లిపోయారు.
ఆ అటెండర్ ఊరుకుంటాడా? ఎంక్వయిరీ చేశాడు.. ఎవరీళ్లు? వాళ్లిచ్చిన కార్డు చూశాడు.. దాని మీద యూవీ కార్పొరేట్ సొల్యూషన్స్ అని ఉంది. దానిని తీసుకెళ్లి కలెక్టర్ పీఏకు చూపించి..ఎవరని అడిగాడు. అప్పుడాయన వివరించాడు ‘‘యూవీ కార్పొరేట్ సొల్యూషన్స్ అని.. రామ్ ఇన్ఫోటెక్ అనే కంపెనీతో పార్టనర్స్‌గా చేరి.. ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ హోదాలో మన రాష్ట్రంలో వలంటీర్లు, సచివాలయ సిబ్బందికి ట్రైనింగ్ ఇస్తారు.. ఏడాదికి 686 కోట్లు వీళ్లకు పీజు‘‘ చెప్పాడు పీఏ. మరి కలెక్టర్ దగ్గరికొచ్చి ఎవరినో తీసేయమంటారేంటి..వాళ్లెవరూ వలంటీర్లు కాదే‘‘ అడిగాడు మళ్లీ అటెండర్.
గూఢచారుల్లా..
పీఏ నవ్వి ‘‘పేరుకే వలంటీర్లు. వీళ్లు గూఢచారుల్లా పని చేస్తున్నారు. మన గురించి, కలెక్టర్ లాంటి అధికారుల గురించి..మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్లను కలిసే బిజినెస్ వాళ్లని..అందరినీ అబ్జర్వ్ చేసి పైకి రిపోర్టులు పంపుతున్నారు. ఆ రిపోర్టులు చూసి సీఎం వెంటనే యాక్షన్ తీసుకుంటున్నాడంట. అందుకే వీళ్లంటే అందరూ భయపడి చస్తున్నారు. వీళ్లేం చెబితే అది చేసిపెట్టేస్తున్నారు‘‘ చెప్పాడు పీఏ.
యూవీ కార్పొరేట్ సొల్యూషన్స్ కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డిదే..
అదీ సంగతి. ఇంతకీ యూవీ కార్పొరేట్ సొల్యూషన్స్ ఎవరిదో కాదు… మన మందు బ్రాండ్ రాజా ఉన్నాడుగా..అదే కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఐటీ సలహాదారుడు పేరుతో మద్యం సలహాదారుడుగా పనిచేస్తున్న పెద్దమనిషి. ఆయనదే. కొత్త కొత్త మద్యం బ్రాండ్లను తయారు చేస్తున్న అదాన్ డిస్టిలరీ కంపెనీ అడ్రస్‌లోనే ఈ కంపెనీ కూడా ఉంది. అదే మన విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డితో డైరెక్టర్‌గా ఉన్న మరో పెద్దమనిషి డైరెక్టర్ గా ఉన్న కంపెనీ అడ్రస్ లోనే దీని అడ్రస్ కూడా ఉంది. అంటే ఈ రాజా క్రియేట్ చేసిన కంపెనీయే ఇది. దానిని అడ్డం పెట్టుకుని.. రాష్ట్రమంతా పెత్తనం చేస్తున్నారు. జిల్లాల్లో అధికారులను ఆడుకుంటున్నారు.
అటు వైసీపీ నేతల మాటలు ఫాలో కావాలే..మళ్లీ వైసీపీ అగ్రనేతలు ఏర్పాటు చేసుకున్న కంపెనీ ప్రతినిధుల మాట వినాలే.. ఎవరికి చెల్లించాల్సింది వారికి చెల్లించుకోవాలే.. లంచం తీసుకునేది ఎంతో గాని…వీళ్లందరికీ ఇచ్చుకునేదే ఎక్కువైందని.. పాపం అధికారులు లబోదిబోమంటున్నారు.