జగన్ ను మంచి ఆసుపత్రిలో చూపిస్తే బాగుంటుంది..!
జగన్ రెడ్డిని మంచి ఆసుపత్రిలో చూపించమ్మా అంటూ వైఎస్ భారతికి విన్నవించాడు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. తుగ్గక్ నిర్ణయాలతో రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిందిగాకా.. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ ఒక ఎయిర్ పోర్ట్ నిర్మించాలని జగన్ రెడ్డి నిర్ణయాన్ని అయ్యన్న తప్పుపట్టారు. ఇటువంటి నిర్ణయాలను చూస్తుంటే మీకు ఎలా ఉందో తెలియదు గాని, మాకైతే మీ ఆయనకి ఏదో అయిందనే అనుమానంగా వస్తోందని విమర్శించారు. ఎందుకైన మంచిది ఒకసారి హైదరాబాద్ గాని, విశాఖలో గాని ఆసుపత్రిలో చూపించడమ్మా.. అంటూ వైఎస్ భారతికి ఆయన సూచించారు.
రాష్ట్రంలో 16 మెడికల్ కళాశాలు ఏమైయ్యాయి..
ఏపీ వ్యాప్తంగా 16 మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తామన్న జగన్ రెడ్డి ప్రభుత్వం హామి ఏమైందని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు నిలదీశాడు. పొలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, ట్రైబల్ యూనివర్సిటీ వంటి వాటి నిర్మాణాలను గాలికొదిలేశారని విమర్శించారు. అవన్నీ పక్కనపెట్టి జిల్లాకో ఎయిర్ పోర్టు కడతావా? అంటూ మండిపడ్డారు. ఉద్యోగులకు, ఫెన్షన్ దారులకు, కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వలేని పరిస్ధితిలో జగన్ ప్రభుత్వాన్ని నెట్టకొస్తున్నారని ఆరోపించారు. ఓటీఎస్ పేరుతో పేదల నుంచే డబ్బులు దండుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్తమీద కూడా పన్నులు వసూలు చేస్తూ.. జిల్లాకో ఎయిర్ పోర్ట్ కడతామని చెప్పడానికి సిగ్గులేదా? అని అయ్యన్న ప్రశ్నించారు.
Must Read:-అయ్యన్న, విజయసాయి ఆరోపణాస్త్రాలు..