నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారం జోరుగా సాగుతోంది. అన్ని పార్టీల అభ్యర్థులు పోటీపోటీగా ప్రచారం చేస్తుండటంతో ప్రచారం రసవత్తరంగా మారింది. ప్రధాన పార్టీలు హంగామా చేస్తున్నాయి. ర్యాలీ నిర్వహిస్తూ గ్రామగ్రామనా ప్రచారం చేస్తున్నాయి. ప్రచారాలకు జనం పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో నాయకులు రోజువారి కూలీలపై ఆధారపడుతున్నారు. కేవలం రెండు గంటల ప్రచారానికే 300 రూపాయలు ఇస్తుండటంతో కూలీలు వ్యవసాయ పనులకు బదులు ప్రచారానికి వెళ్తున్నారు. దీంతో నాగార్జున సాగర్ లో కూలీల కొరత ఏర్పడింది. కూలీలు దొరక్క రైతులు ఇబ్బందులు పడుతుండటంతో కొందరు బీహర్ వలస కూలీలతో పనులు చేయించుకుంటున్నారు. నిన్న, మొన్న జరిగిన ఎన్నిక ప్రచారానికి ఓ నాయకుడు 900 మంది కూలీలను తీసుకెళ్లడంతో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఉప ఎన్నిక ముగిసేదాకా వలస కూలీలపై ఆధారపడనున్నారు సాగర్ రైతులు.
Must Read ;- జానారెడ్డి సీనియార్టీ VS కేసీఆర్ ఇమేజ్ VS మోదీ ఇమేజ్.. సాగర్‌లో పేలుతున్న విమర్శల తూటాలు