ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ ఛైర్మన్ల ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఎక్కువ చోట్ల వైసీపీ గెలిచినిప్పటికీ, తాడిపత్రి, మైదుకూరులో మాత్రం నువ్వా-నేనా అన్నట్టుగా టీడీపీ , వైసీపీ మధ్య సస్పెన్స్ కొనసాగుతోంది. తాడిపత్రిలో మొత్తం 36 వార్డులుండగా టీడీపీ 18చోట్ల.. వైఎస్సార్‌సీపీ 16 చోట్ల విజయం సాధించాయి. సీపీఐ, స్వతంత్ర అభ్యర్థి చెరొకచోట గెలుపొందారు. ఏపార్టీకి స్పష్టమైన మెజార్టీ దక్కకపోవడంతో ఇక్కడ ఉతంఠ వాతావరణం నెలకొంది. మొత్తంగా ఇక్కడా చైర్మన్ ఎన్నిక రసవత్తరంగా మారనుంది.
ఎక్స్ అఫిషియో ఓట్లు కీలకం
తాడిపత్రిలో ఫలితాలు ఏ ఒక్క పార్టీకి అనుకూలంగా రాకపోవడంతో ఎక్స్ అఫిషియో ఓట్లు కీలకం కానున్నాయి. దాంతో ముగ్గురి వైపీసీ ఎమ్మెల్సీలు, ఒక టీడీపీ ఎమ్మెల్సీ ఎక్స్ అఫిషియో ఓట్లకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆ నలుగురికి తాడిపత్రిలో అర్హత లేదని మున్సిపల్ కమిషనర్ తిరస్కరించారు. దాంతో ప్రధాన పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి. ఇప్పటికే టీడీపీ తమ కౌన్సిలర్లను రహస్య ప్రాంతానికి తరలించింది. ఎలాగైనా తాడిపత్రి పీఠం కైవసం చేసుకోవాలని వైసీపీ పావులు కదుపుతోంది.
Must Read ;- రహస్య ప్రదేశానికి తాడిపత్రి టీడీపీ కౌన్సిలర్లు