రాజధాని అమరావతి పేరు ఇప్పుడు ప్రపంచ టెక్నాలజీ రేసులో హాట్ టాపిక్‌గా మారింది! ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే క్వాంటమ్ వ్యాలీ రూపకల్పనకు అమరావతి వేగంగా అడుగులు వేస్తోంది. గ్లోబల్ క్వాంటమ్ హార్డ్‌వేర్, హెల్త్‌కేర్ రీసెర్చ్ దిగ్గజాలు అమరావతిలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కడుతుండగా, ఏపీ ప్రభుత్వం వీటికి పచ్చజెండా ఊపింది. ఈ నిర్ణయంతో రూ.350 కోట్లకు పైగా పెట్టుబడులతో పాటు స్థానిక యువతకు వందలాది హైటెక్ ఉద్యోగాలు ఖాయమయ్యాయి.
అమరావతికి వస్తున్న టాప్ క్వాంటమ్ దిగ్గజాలు ఇవే –
* ఎస్ఆర్ఎస్టీఐ (SRSTI) క్వాంటమ్: డీప్‌టెక్ రీసెర్చ్, అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో ఏకంగా రూ.100 కోట్ల భారీ పెట్టుబడి పెట్టబోతోంది. దీని ద్వారా 500 మందికి ఉద్యోగాలు రానున్నాయి.
* క్వాంటమ్ కోడన్ ప్రైవేట్ లిమిటెడ్: నెక్స్ట్ జనరేషన్ డ్రగ్స్, బయో రంగానికి సంబంధించి రూ.167 కోట్ల భారీ నిధులతో రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తోంది. దీనివల్ల 126 మందికి నిపుణుల ఉద్యోగాలు దక్కనున్నాయి.
* ఆరోహక్ టెక్నాలజీస్: సైబర్ సెక్యూరిటీ, ఫోటోనిక్స్ విభాగాల్లో నిపుణత ఉన్న ఈ సంస్థ రూ.62 కోట్ల పెట్టుబడితో 300 మందికి కొత్త అవకాశాలు కల్పిస్తోంది.
ట్రైక్వాంటా లాబ్స్: స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన ‘టీక్యూఎన్సీ-60ఐ’ కంప్యూటింగ్ హార్డ్‌వేర్ ప్రాజెక్ట్ కోసం రూ.35 కోట్లు కేటాయించి, 175 మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది.
* ఫోటాన్ కోర్ సిస్టమ్స్: ఫోటాన్ క్యూ విభాగంలో విస్తరణ కోసం రూ.9 కోట్ల పెట్టుబడితో 45 మందికి ఉపాధి చూపనుంది.
* క్వాన్ఫ్లుయెన్స్: సెక్యూరిటీ సొల్యూషన్ల అభివృద్ధికి రూ.5 కోట్ల పెట్టుబడితో 30 మందికి అవకాశాలు ఇస్తోంది.
వేరిడేటా హెల్త్ ఐఎన్‌సీ: అమరావతి కేంద్రంగా గ్లోబల్ ఇంజనీరింగ్ హబ్‌ను డెవలప్ చేసేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంది.
ఒకే దెబ్బకు అమరావతి వైపు ఇన్ని అంతర్జాతీయ స్థాయి టెక్ దిగ్గజాలు రావడం రాష్ట్రాన్ని క్వాంటమ్ టెక్నాలజీకి నేషనల్ హబ్‌గా నిలబెట్టబోతోంది.











