ఏపీలో విద్యుత్ చార్జీల పెంపుపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవిఎల్ నరసింహా రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. శ్రీ శుభకృత్ నామ సంవత్సర ప్రారంభంలోనే కరెంటు చార్జీలు పెంచుతూ ఈ ఉగాదిని చెడుగా మిగిల్చాలని సీఎం @ysjagan భావిస్తున్నట్లుంది.పేదలపై కూడా చార్జీలు పెంచి వైసీపీ ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తిస్తోంది.దీనికి “జగనన్న విద్యుత్ చార్జీల వడ్డన ” అని పెట్టలేదేం సీఎం గారు ? అంటూ జీవిఎల్ ట్వీట్ చేశారు. కాగా ఒకే సంవత్సరంలో రెండు సార్లు విద్యుత్ ప్రతిపాదనలు అమలు చేయడం పై ఇప్పటికే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా, జీవిఎల్ చేసిన ట్వీట్ తో విద్యుత్ చార్జీల పెంపు అంశం చర్చనీయాంశంగా మారింది.