కరోనా నేపథ్యంలో కొన్ని సంస్థలు ఉద్యోగాలు, జీతాల్లో కోతలు విధించాయి. దీంతో వేలాది మంది జాబుల్లేక రోడ్డున పడ్డారు. అయితే అన్‌లాక్ తరువాత పరిస్థితులు కాస్త చక్కదిద్దుకున్నాయనే చెప్పాలి. అయినా కానీ హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో ఇంకా చాలా మంది ఉద్యోగాలు లేక, దొరకకా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడిప్పుడే ప్రజలు బయటికి వస్తున్నారు. వ్యాపారాలు సైతం ఓ మోస్తారుగా నడుస్తున్నాయి. ముఖ్యంగా హోటళ్లు, దాబాలు, సేవారంగానికి సంబంధించిన ఇతర వ్యాపారాలు ఓ గాడిన పడుతున్నాయి. ఈనేపథ్యంలో తమ వ్యాపారాలను పెంచుకునేందుకు ఈ కామర్స్ సంస్థ అయిన అమెజాన్ భారీగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టింది.
ఏకంగా 20 వేల ఉద్యోగాలను ప్రకటించింది. కష్ట సమయంలో ఉంటూ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఇది నిజంగా మంచి శుభవార్తే అని చెప్పాలి. మరి ఇంకెందుకు ఆలస్యం ఎవరైతే జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో వారు దరఖాస్తు చేసుకోండి. ఆన్‌లైన్‌లో లేదా అమెజాన్ డెలివరీ సెంటర్లకు నేరుగా వెళ్లి కూడా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. చాలా పట్టణాల్లో ఈ డెలివరీ సెంటర్లు ఉన్నాయి.
అయితే చేయాల్సిన ఉద్యోగం ఏమిటంటే డెలివరీ బాయ్ ఉద్యోగం. డెలివరీ బాయ్ ఉద్యోగం కదా అని అలా తీసిపారేయకండి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి వచ్చేంత ఆదాయం తద్వారా మీరు సంపాదించొచ్చు. 4 గంటలు కష్టపడితే చాలు. ఈ సమయంలో రోజుకు 100 నుంచి 150 ప్రాడక్టుల వరకు డెలివరీ చేయొచ్చు. అయితే దీనికి బైక్ ఉండాలి. అంతే కాదు డ్రైవింగ్ లైసెన్స్, బైక్ ఇన్సూరెన్స్, ఆర్‌సి ఉండాలి. ఒక ప్రాడక్టు డెలివరీకు రూ.20 వరకు పొందవచ్చు. ఇలా రోజుకు 4 గంటలు కష్టపడితే రూ.2000కు పైగానే సంపాదించవచ్చు. అదే నెలకైతే సుమారు రూ.60వేల నుంచి 70 వేల వరకు సంపాదించొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి.
Also Read ;- ఆత్మవంచన వీడకుంటే.. అథోగతి తప్పదు రేవంత్‌రెడ్డి సార్!











