తెల్చకుంటే .. తేల్చుకుంటాం !
ఉద్యోగ సమస్యలు, పీఆర్సీ పై ప్రభుత్వ స్టాండేమిటో తెల్చకుంటే .. తామే తేల్చుకుంటామని ప్రభుత్వ ఉద్యోగ సంఘాల జేఏసీలు అల్టీమేటం జారీ చేశాయి. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించుకుంటే .. ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ ఎన్జీవో జేఏసీ సంయుక్తంగా కార్యాచరణను ప్రకటిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయి. కొంత కాలంగా పీఆర్సీతో పాటుగా పెండింగ్ లో ఉన్న డిమాండ్లను జగన్ ప్రభుత్వం మాటలతోనే సరిపెడుతున్నారని, వాని సాధనకు సమాయక్తం కావాలని జేఏసీలపై ఉద్యోగులు ఒత్తిడి తీసుకొస్తున్నారు. గత్యంతరం లేక ఉద్యోగ సంఘాల జేఏసీలు తిరుగుబాటు బావుట ఎగరవేసేందుకు సిద్ధమౌతున్నాయి. అక్టోంబర్ నెలాఖరు నాటికే పీఆర్సీ పై స్పష్టత ఇస్తామని చెప్పిన ప్రభుత్వం, నివేదిక బయటపెట్టకుండా జాప్యం చేయడంపై రాష్ట్ర ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమౌతున్నాయి జేఏసీలు.
నివేదిక బయటపెట్టకుండా .. పీఆర్సీ ప్రకటిస్తే ఉద్యమిస్తాం!
ప్రభుత్వ ఉద్యోగుల అందిల్సిన 11వ పీఆర్సీ, సీపీఎస్ రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ, రూ.1600 కోట్ల చెల్లింపులపై తక్షణమే ప్రభుత్వం స్పందించకుంటే డిసెంబర్ 1 నుంచి ఉమ్మడి కార్యాచరణకు దిగుతామని ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ప్రకటించాయి. ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసేలా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల ప్రవర్తిన్నారని జేఏసీ నేతలు బండిశ్రీనివాసరావు, బొప్పరాజు వాపోతున్నారు. ఆర్థికశాఖ మంత్రి బుగ్గన ఉద్యోగుల సమస్యలపై ఏనాడు పట్టించుకోలేనంత బీజీ అయ్యారని అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ సంఘాల సమస్యలను సీఎం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. నివేదిక బయటపెట్టకుండా .. పీఆర్సీ ప్రకటిస్తే ఉద్యమిస్తామని హెచ్చరించారు.
డిసెంబర్ 1 నుంచి కార్యాచరణకు ఉద్యోగుల యాక్షన్ ప్లాన్..!
రాష్ట్ర వ్యాప్తంగా 94 ఉద్యోగ సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. డిసెంబర్ 1న సీఎస్ సమీర్ శర్మకు ఉద్యోగ సంఘాలు నోటీసు ఇచ్చిన తరువాత కార్యాచరణ ఉంటుందని ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రకటించింది. డిసెంబర్ 7 నుంచి 10 తేదీ వరకు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు, బోజనం విరామంలో నిరసనలు తెపడం, 13 నుంచి 15వ తేదీ వరకు తాలూకా కేంద్రాల్లో నిరసనలు, 16 నుంచి అన్ని తాలూకా కేంద్రాల్లో ధర్నాలు, డిసెంబర్ 21 నుంచి 26 వరకు జిల్లా ప్రధాన కేంద్రాల్లో ధర్నాలు, డిసెంబర్ 27న విశాఖ, 30న తిరుపతి, జనవరి 3న ఏలూరు, 6న ఒంగోలలో ఉద్యోగ సంఘాల ప్రాంతీయ సమావేశాలు నిర్వహించి ఉద్యమాన్ని మరింత ఉధృతంగా ముందుకు తీసుకుపోవాలని భావిస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే పెండింగ్ లో ఉన్న 7 డీఏలను, ఉద్యోగుల దాచుకున్న రూ.1600 కోట్లను తక్షణమే ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Must Read ;- నెలనెల జీతాలే కనా కష్టం .. పీఆర్సీ డౌటే!