August 7, 2026 2:29 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

గ్రేటర్ విజయవాడ..కల సాకారం దిశగా అడుగులు..!

December 27, 2025 at 7:22 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

గ్రేటర్ విజయవాడ దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. ఇటీవల స్థానిక ఎంపీ శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ రావు నేతృత్వంలోని బృందం అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి, ఈ మేరకు ఓ రిపోర్టును అందజేసింది. అనేక ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ డిమాండ్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు. దీంతో విజయవాడ గ్రేటర్ విజయవాడగా మారబోతుందనే ఆశలు మళ్లీ చిగురించాయి.

విజయవాడ మహా నగరానికి అడుగులు పడాల్సిన సరైన సమయమిదే. ఇప్పటికే విజయవాడకు చుట్టుపక్కల ఉన్న మైలవరం, పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల పరిధిలోని..అనేక గ్రామాలు, తాడిగడప లాంటి మున్సిపాలిటీలు అనధికారికంగా విలీనమైనా.. నగరపాలికలో భాగం కాకపోవడంతో అభివృద్ధికి దూరంగా ఉండిపోయాయి. విజయవాడ మహానగరమైతే విస్తీర్ణం భారీగా పెరుగుతుంది. జనాభా 20 లక్షలపైనే ఉంటుంది. దీంతో వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద భారీగా నిధులు వస్తాయి. సీనియర్‌ IAS అధికారులు కమిషనర్లుగా ఉంటారు. వేగంగా అభివృద్ధి చెందే వీలుంటుంది.

నగరానికి ఆనుకుని ఉండే.. కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లోని ప్రాంతాలే కాకుండా గుంటూరు పరిధిలోని తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీలు కూడా దాదాపు విజయవాడతో కలిసిపోయాయి. వీటిని కూడా విలీనం చేస్తే.. రాష్ట్రంలోనే అతిపెద్ద నగరంగా ఏర్పడుతుంది. భవిష్యత్తులో చుట్టుపక్కల ఉండే.. గుంటూరు, తెనాలి, పరిటాల, గన్నవరం, కంకిపాడు వరకూ..నగరం విస్తరిస్తుంది. ప్రస్తుతం గ్రేటర్‌ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చజెండా ఊపడంతో అధికారులు మరింత వేగంగా చర్యలు చేపడితే దశాబ్దాల కల సాకారమవుతుంది.

విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో 2011 లెక్కల ప్రకారం..10.34 లక్షల జనాభా ఉంది. విలీనం చేయబోయే 74 గ్రామాల పరిధిలో ఉన్న 5.54 లక్షలతో కలిపి 15.88 లక్షలవుతుంది. రాష్ట్ర విభజన తర్వాత గత పదేళ్లలో నగర జనాభా 20 శాతానికి పైగా పెరిగింది. విలీన గ్రామాల్లోని పెరుగుదలతో కలిపితే కనీసం నాలుగైదు లక్షలు అదనంగా ఉంటుంది. ఈ లెక్కన గ్రేటర్‌ జనాభా.. ప్రస్తుతం అనధికారికంగా 20 లక్షలకు పైనే ఉంటుంది. విజయవాడ శివార్లలోని 7 మండలాల్లోని గ్రామాలు విలీనం కానున్నాయి. ఇబ్రహీంపట్నం-13, విజయవాడ రూరల్‌ -19, జి.కొండూరు-02, కంకిపాడు-11, పెనమలూరు- 08, గన్నవరం-19, ఉంగుటూరు పరిధిలో 2 గ్రామాలున్నాయి. తాడిగడప, కొండపల్లి మున్సిపాలిటీలు 2 విలీనం కానున్నాయి.

విజయవాడలో ఇప్పటికే జక్కంపూడి, గొల్లపూడి, కానూరు, పోరంకి, తాడిగడప, ప్రసాదంపాడు, ఎనికేపాడు, నిడమానూరు, గూడవల్లి ఇవన్నీ పూర్తిగా కలిసిపోయాయి. పంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలో ఉండడంతో అభివృద్ధికి దూరంగా రహదారులు, డ్రైనేజీ వ్యవస్థలు కూడా సరిగా లేవు. జక్కంపూడి, YSR కాలనీలు నగరంలో అనధికారికంగా భాగమైపోయాయి. అత్యధిక మందికి గుర్తింపు కార్డులు కూడా విజయవాడలోనే ఉన్నాయి. 30 వేలకు పైగా ఇక్కడ ఓట్లుంటే.. కేవలం 13 వేలు మాత్రమే మైలవరంలో ఉన్నాయి. శివార్లలోని అన్ని గ్రామాల పరిస్థితీ ఇదే.

తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాల్లోనూ 2014 తర్వాత జనాభా 20 శాతానికి పైగానే పెరిగిందని అంచనా. తాడేపల్లి, మంగళగిరి పేరుకు గుంటూరు జిల్లాలోనే ఉన్నా..ఎక్కువగా ఆధారపడేది విజయవాడపైనే. తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీలను కూడా గ్రేటర్‌ విజయవాడలో విలీనం చేస్తే నగర పరిధి భారీగా పెరుగుతుంది. గ్రేటర్‌ విజయవాడ విస్తీర్ణం 661.79 చదరపు కిలోమీటర్లు అవుతుంది. తాడేపల్లి, మంగళగిరి కూడా కలిస్తే మహానగరపాలక సంస్థగా మారుతుంది.

గ్రేటర్‌ విజయవాడకు అడ్డంకులివే –

గ్రేటర్‌ ఏర్పాటుకు డిసెంబర్‌ 31లోగా నోటిఫికేషన్‌ కచ్చితంగా ఇస్తేనే.. ప్రక్రియ పట్టాలెక్కుతుంది. లేదంటే జనవరిలో జనగణన ప్రారంభమవుతుంది. అధికారులంతా పనుల్లో బిజీ అవుతారు. ఆ తర్వాత పంచాయతీల ఎన్నికల కోడ్‌ వస్తుంది. ఎన్నికలు జరిగితే ఈ పంచాయతీలకు కొత్త సర్పంచులొస్తారు. ఎన్నికైన వెంటనే విలీనమంటే కొత్త సర్పంచులు అంగీకరించరు. దీంతో గ్రేటర్‌ ప్రతిపాదన మళ్లీ మొదటికొస్తుంది. విలీన ప్రాంతాల్లో గ్రామసభలు పెట్టి తీర్మానాలు చేసిన తర్వాత నోటిఫికేషన్‌ ఇవ్వాలంటే.. ఈ నెలాఖరులోగా పూర్తవడం కష్టం. అందుకే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించి..గెజిట్‌ను విడుదల చేస్తే.. వెంటనే ప్రక్రియను ప్రారంభించవచ్చని ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతున్నారు. తాజాగా హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ పరిధిని పెంచి 300 డివిజన్లుగా మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇలాగే గెజిట్‌ను విడుదల చేసింది. ఇదే విధానం ఇక్కడా అమలు చేస్తే బాగుంటుందని చెబుతున్నారు.

Tags: #Amaravatiandhra pradeshap developmentCM ChandrababuGreater VijayawadaGreater Vijayawada Dream Back on TrackLatest Newsleonewsleotopnda government
Previous Post

జగన్‌కు RSS చీఫ్‌ వార్నింగ్..!

Next Post

తిరుమల నడకదారిలో.. భక్తులకు వైద్య సేవలు..!

Related Posts

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

by లియో డెస్క్
August 5, 2026 11:50 pm

అబద్దాలు చెప్పడం అడ్డంగా దొరికిపోవడం.. వైసీపీ అధినేతకు అలవాటైన విద్య. తాజాగా తూర్పుగోదావరి...

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

by లియో డెస్క్
August 5, 2026 7:32 pm

నెల్లూరు జిల్లా దుత్తలూరు దశ తిరగనుంది. హైదరాబాద్‌ బేస్డ్‌గా పని చేస్తున్న అనంత్...

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

by లియో డెస్క్
August 5, 2026 1:37 pm

రోడ్ల మీద డ్రామాలు చేయవచ్చు. కానీ అదే డ్రామాలను హైకోర్టులో కూడా చేయాలంటే...

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

by లియో డెస్క్
August 4, 2026 5:41 pm

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో బూతులతో రెచ్చిపోయిన బోరుగడ్డ అనిల్‌.. ఇప్పుడు తాడేపల్లి...

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

by లియో డెస్క్
July 28, 2026 6:59 pm

కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించి DSC ప్రక్రియపై వైసీపీ చీఫ్ జగన్‌మోహన్...

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

by లియో డెస్క్
July 27, 2026 6:04 pm

ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చేసి, ఏపీని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టే భోగాపురం గ్రీన్ ఫీల్డ్...

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

by లియో డెస్క్
July 23, 2026 7:45 pm

ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో...

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

by లియో డెస్క్
July 20, 2026 5:57 pm

వైసీపీ హయాంలో జరిగిన అధికార దుర్వినియోగం, భూ ఆక్రమణల లీలలు ఇప్పుడు ఒక్కొక్కటిగా...

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

by లియో డెస్క్
July 16, 2026 5:22 pm

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు హిట్ అండ్ రన్‌ ఘటన..దానిపై వైసీపీ...

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

by లియో డెస్క్
July 13, 2026 7:45 pm

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఎమ్మెల్యే రోజా రాజీనామా!? శ్రీశైలం మల్లన్నకే తెలియాలి ఆ రాజకీయం!!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

BollyWood Actress Disha patani Latest Hot And Bikiny Photos

actress Darshana Banik Hot n Spicy Photo Gallery

Lavanya Tripathi

నో మహా ఓన్లీ ఏబీఎన్ : సంతృప్తి పరుస్తానన్న వీకే!

ఒక పెళ్లి- ఒక చావు- ఒక డీల్.. మధ్యలో వరద టూర్ ..!

ముఖ్య కథనాలు

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist