రితూ వర్మకు వరుడు కావాలట. ఆ వరుడు మరెవరో కాదు నాగశౌర్య. వీరిద్దరితో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న సినిమా పేరును ‘వరుడు కావలెను‘గా నిర్ణయించేశారు. దీని మీద ఓ వీడియో కూడా విడుదల చేశారు. తమ కుమార్తెకు తగిన ‘వరుడు‘ కోసం ‘వధువు‘ తల్లి దండ్రులు అన్వేషణ సాగించే సంగతి తెలిసిందే. పత్రికలలో ఇచ్చే ప్రకటన మాదిరిగానే ఈ సినిమాకు పేరు పెట్టారు.
నాగ శౌర్య , రీతువర్మ జంటగా లక్ష్మీ సౌజన్యను దర్శకురాలిగా పరిచయం చేస్తూ ‘వరుడు కావలెను‘ రూపొందుతోంది. విడుదల చేసిన వీడియో లో నాగశౌర్య, రీతువర్మచాలా అందంగా కనిపిస్తారు. వధూవరులు కదా మరి. ఈ చిన్న దృశ్యానికి విశాల్ చంద్రశేఖర్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష తదితరులు ఇతర పాత్రలను పోషిస్తున్నారు. దీనికి నిర్మాత: సూర్య దేవర నాగవంశీకథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: లక్ష్మీసౌజన్య











