సంక్షేమం పెంచి.. అభివృద్ధిని ముంచి!
జగన్ రెడ్డి టార్గెట్ ప్రకారం నవరత్నాలకు మెరుగులు దిద్ది ప్రజలకు అందిస్తున్నామని అనుకుంటున్నారు. సంక్షేమ చూసి ఓట్లు రాలతాయని భ్రమల్లో ఉంటే పిచ్చిపొరపాటేనని నేడు సర్వేలు సౌండ్స్ చేస్తున్నాయి! రాష్ట్రంలో వీసమెత్తు కూడా అభివృద్ధి చేయకుండా ముందుస్తుకు పోతే ప్రజల రియాక్షన్ ఏ స్థాయిలో ఉంటుందో జగన్ రెడ్డి అండ్ కో బాగా తెలుసు! కూల్చడమే తప్ప నిలబెట్టలేని ప్రభుత్వంగా ఈ 33 నెలల్లో జగన్ ప్రభుత్వం వేసుకున్న ముద్ర అంత తేలికగా మరిచిపోయే విషయం కాదు! రాష్ట్ర పాలనలో సగం పైగా పనిదినాలు ‘‘ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని ఎలా తొక్కాలి, ఆ నాయకులపై ఎలా కక్షను సాధించాలి, అమరావతి వైభవాన్ని ఎలా పతనం చేయాలి, ఇసుక, మద్యాన్ని ఎలా స్వాప్రయోజనాలకు వినియోగించుకుని సొమ్ము చేసుకోవాలి, ప్రశ్నించే విపక్షాలు, మీడియా, సామాజీక మాధ్యమాలపై ఎలా దేశ ద్రోహం కేసులు బనాయించాలి అన్న ధోరణిలో గడిచిపోయాయి.’’ వీటిపై ఫోకస్ పెట్టి.. ‘‘ప్రజలకు ఏం కావాలి?, ప్రజలేం కోరుకుంటున్నారు?, యువతకు ఉపాధి కల్పన ఎలా చేయాలి?, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను దఫాల వారీగా ఎలా నెరవెర్చి వారిని సంతృప్తి పరచాలి?, రాష్ట్రంలో డొర్లు తెరచుకున్న సమస్యలకు అభివృద్ధితో ఎలా చెక్ పెట్టాలి?, జాతీయ, అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించి రాష్ట్రానికి ఎలా పెట్టుబడులు తేవాలి?, రాజధాని అమరావతి సమస్య అంతర్జాతీయ స్థాయికి వెళ్లకుండా ఆదిలోనే ఎలా వ్యూహత్మకంగా గాడిలో పెట్టాలి?, పెరుగుతున్న ధరలను పక్క రాష్ట్రాలతో కంపారీజన్ చేసుకుని వాటిని ఎలా అదుపులోకి తీసుకురావాలి?, విభజన హామీల్లో భాగంగా కేంద్రం రాష్ట్రానికి అందిస్తామన్న హామీలు, ప్రయోజనాలు, రైల్వేజోన్, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి నిధులు’’.. ఇలా అనేక సమస్యలను ఇన్నాళ్లు గాలికొదిలేశారు. అత్యంత ప్రాధన్యత కల్పించాల్సిన పై అంశాలను పక్కనపెట్టి.. నవరత్నాలు పేరుతో సంక్షేమ జపిస్తూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సంక్షోభంలోకి నెట్టివేశారు జగన్ రెడ్డి! ఇటువంటి రాజకీయ క్లిష్టపరిస్థితులను మరిచి.. జగన్ ముందస్తు ఎన్నికలకు పోతారా? అంటే అంత సీన్ ఉండదనే విశ్లేషణలు వినవస్తున్నాయి.
Must Read:-ముందుస్తుకు పోతే ముప్పు వైసీపీకే! తనగొయ్యి తానే తవ్వుకుంటున్న జగన్!!
జగన్ పార్టీ పతనానికి పదిమెట్లు..
విజయానికి అందరూ మెట్లు వేసుకుంటూ ముందుకు పోతారు.. కానీ రాజకీయాల్లో ఫస్ట్ టైం జగన్ రెడ్డి లాంటి పొలిటిషియన్ తన పతనానికి రీవర్స్ లో మెట్లు వేసుకుంటూ అపజయం అంచుకు చేరుకుంటున్నారు అన్న విమర్శలు కొడై కూస్తున్నాయి! ఒక్కఛాన్స్ అనే సెంటిమెంట్ జగన్ పార్టీకి అధికారాన్ని కట్టపెట్టింది ఏపీ ప్రజానీకం! ఇప్పుడు ఆ ఛాన్స్ ఎందుకిచ్చామా? అని తప్పుకు లెంపలేసుకుంటున్నామని వాపోతున్నారు. ప్రజావేదికను కూల్చి.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును దెబ్బకొట్టామని అనుకున్నారు అధికారపార్టీ నేతలు. దానివల్ల ప్రజాధనం ఎంత నష్టం వాటిల్లిందో ప్రజలు గమనించారు. దానిపక్కన పెడితే మూడు రాజధానులను ప్రకటించి, మరోసారి తెలుగుదేశంపార్టీ, చంద్రబాబును దెబ్బకొట్టాలని చూశారు. మరి ఏమైంది.. తప్పును ఒప్పుకుని పెట్టిన మూడు రాజధానుల బిల్లులను వెనక్కి తీసుకున్నారు. ఇదీ ఒక రాజకీయ స్ట్రాటజీనే అనుకుందాం.. మరి నేటికీ చంద్రబాబు ప్రభుత్వ హయంలో కట్టించిన సచివాలయం, అసెంబ్లీ భవనాలనే వాడుతున్నారుగా? మరి వాటిని కూడా ప్రజావేదిక మాదిరిగా ఎందుకు కూల్చలేకపోయారు? అన్న విమర్శలు లేకపోలేదు! రెండునరేళ్లుగా మూడు రాజధానుల మంత్రం జపిస్తూ.. ఒక ఇటుక అయిన విశాఖ, కర్నూలులో వేశారా అంటే.. అది లేదు! మరి విశాఖ, కర్నూలు జిల్లాలకు రాజధానులు తెచ్చి అభివృద్ధి చేస్తాం అంటే.. చేస్తున్న జిమ్మిక్కులు గమనించలేనంత అజ్ఞానులైతే లేరు అన్నది జగన్ అండ్ కో తెలుసుకోవాలి! కులాలు వారీగా మంత్రి పదవులు, కార్పోరేషన్ ఛైర్మన్లు కట్టపెట్టమని చెప్పుకొస్తున్నారు.. ‘‘కానీ ఏపీలో మంత్రులు, ఛైర్మన్లు రబ్బర్ స్టాంపులని, గ్రీన్ ఇంకు పెన్ మాత్రం రెడ్డి సామాజీక వర్గం వ్యక్తుల జేబుల్లో ఉంటుందని అన్ని కులాల వారు ఎప్పుడో గుర్తించారు.’’ ఐఏఎస్, ఐపీఎస్ లను ఉన్నఫలంగా బదిలీ, కొత్త జిల్లా ఏర్పాటు, పీకే టీం సర్వేలు అంటూ వార్తలు వండి, గాసిప్స్ అద్ది.. అధికార పార్టీ చేస్తున్న హడవుడి అంతా.. ప్రజలు, విపక్షాల అటెన్షన్ డైవర్ట్ చేయడానికే తప్ప, మరోకటి లేదు అన్నది క్లియర్! ఫైనల్ గా ముందస్తుకు వెళ్లేంత దమ్ము, దైర్యం అధికారపార్టీకి లేదు అన్నది గట్టిగా వినిపిస్తున్న వాదనలే! ఇవి ఇలా ఉంటే.. ‘‘1.మూడు రాజధానులు, 2.కొత్త జిల్లా కుంపటి, 3. ప్రభుత్వ ఉద్యోగులలో రగిలిన కడుపుమంట, 4. త్వరలో మంత్రి వర్గ విస్తరణ, 5. మీడియాపై చిన్నచూపు, 6. ప్రశ్నించే వారిపై అక్రమంగా బనాయించే దేశద్రోహం కేసులు, 7. బూతుల మంత్రులచే వాత్సయాన పురాణం, 8. విలీనం పేరుతో ఆడుతున్న డ్రామాలు, 9. చేస్తున్న అప్పులు,10. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు .. ఇవి చాలు జగన్ ప్రభుత్వం ఎందుకు పతనపు అంచులకు చెరిందో చెప్పడానికి! ఈ దశ జాడ్యాలు రాష్ట్రంలోని అన్ని వర్గాల వారిలో చెరగని ముద్ర వేశాయి. వీటన్నింటి పక్కనపెట్టి.. పీకేలాంటి వారు వచ్చి ఆయనతో పాటు సముద్రం గర్భంలో మునిగి ఉన్న ఓడలను బయటకు తీసే జాకీలను తెచ్చి జగన్ రెడ్డి పార్టీని లేపాలని చూసినా.. శృంగభంగమే తప్ప వేరోకటి కాదు అన్నది వాస్తవం! పీకేలాంటి వాళ్లు ఎందరొచ్చిన వైసీపీ ముందుస్తుకు పోయినా, ఆ తరువాత పోయినా.. కాలగర్బంలో కలిసిపోవడం ఖాయమనే సర్వేలు చెబుతున్న గ్రాస్ రూట్ వాస్తవాలు! ఇవన్నీ కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నా.. జగన్ రెడ్డి అండ్ కో ముందస్తు ఎన్నికలకు పోతే.. ‘‘సోనియా గాంథీ ఏపీని ఎందుకు విభజించిందో అర్థంకాక నేడు తలపట్టుకున్న (ఏపీలో కాంగ్రెస్ పతనం) మాదిరిగా వైఎస్సార్సీపీ పరిస్థితి కూడా రాష్ట్రంలో పతనంకాక తప్పదని వినవస్తున్న రాజకీయ విశ్లేషణలు!
Also Read:-జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఎన్టీటీ షాక్ ..! ఆ మూడు రిజర్వాయర్ల పనులు ఆపండి!!