కంటెంట్ ఉన్న కథల్ని ఎంచుకుంటూ తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకాభిమానం సొంతం చేసుకుంటున్న యంగ్ హీరో సత్యదేవ్, మిల్కీబ్యూటీ తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం గుర్తుందా శీతాకాలం. ప్రముఖ దర్శకుడు నాగశేఖర్ దర్శకత్వం లో నాగశేఖర్ మూవీస్ బ్యానర్ పై నాగశేఖర్, భావన రవి లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
ఈ కార్యక్రమంలో చిత్ర హీరో సత్యదేవ్, దర్శకనిర్మాత నాగశేఖర్, సంగీత దర్శకుడు కాలభైరవ, సినిమాటోగ్రాఫర్ సత్య హెగ్ఢే, చిత్ర యూనిట్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ జరిగిన దగ్గర నుంచి టాలీవుడ్ మార్కెట్ లో బాగానే డిష్కన్స్ మొదలైయ్యాయి.
తెలుగుతో పాటు ఈ సినిమాను తమిళంలో కూడా విడుదల చేస్తున్నారు. ఆక్టబోర్ నుంచి ఈ సినిమా రెగ్యూలర్ షూట్ ప్రారంభించడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. తమన్నా ప్రస్తుతం కోవిడ్ కారణంగా ఐసోలేషన్ లో ఉండటంతో ఈ చిత్ర ప్రారంభోత్సవానికి హాజరు కాలేకపోయింది. ఈ చిత్రంలో మిల్కీబ్యూటీ క్యాన్సర్ పేషంట్ గా నటించబోతుంది. హీరో సత్య దేవ్ మూడు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు. అరకు, లంబసింగి, వైజాగ్ తదితర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ ని జరపబోతున్నారు.