కెరీర్ ఆరంభంలో హీరోయిన్ గా నిలదొక్కోవాలని ఆమె చేసిన ప్రయత్నం అంతా ఇంతా కాదు అయితే అప్పట్లో ఆమె నటించిన చిత్రాలేవీ ప్రేక్షకాదరణ అంతగా పొందలేకపోయాయి. దాంతో అవకాశాలు దరిచేరకపోవడంతో వెంటనే ఐటమ్ గర్ల్ అవతారం ఎత్తారు. ఎనిమిదేళ్ల క్రితం రానా, జెనీలియా జంటగా వచ్చిన “నా ఇష్టం” చిత్రంలో “జిలేలే జిలేలే..” అనే ఐటమ్ సాంగ్ ద్వారా హోరెత్తించిన ఆమె వెనుదిరిగి చూసుకొనే అవకాశం లేకుండా వరుస ఐటమ్ ఆఫర్లు వచ్చాయి. “మిర్చి, అత్తారింటికి దారేది, భాయ్, రామయ్యా వస్తావయ్యా” వంటి చిత్రాలలో ఐటమ్ నెంబర్లతో సందడి చేసిన ఆమె ఆ తర్వాత కూడా ఆ తరహా ఆఫర్లతో బిజీగా ఉన్న విషయం గుర్తుండే ఉంటుంది. “జై లవకుశ, పంతం” చిత్రాలు చేసిన తర్వాత ఇక అవకాశాలే లేకుండాపోయాయి.
గత రెండేళ్లలో ఒక ఏడాదిని కోవిడ్ కాలమని సరిపెట్టుకున్నా..అంతకముందు ఏడాదిలో ఆమెకు అంతగా అవకాశాలు లేవనే చెప్పాలి. తాజాగా అందరి దృష్టిలో పడాలనే ఉద్దేశ్యంతో చికెన్ కర్రీని అద్భుతంగా ఎలా వండుకోవచ్చో చూపుతూ… ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి మంచి స్పందనే వస్తోంది. ఇప్పుడిప్పుడే సినిమాల షూటింగులు తిరిగి ప్రారంభమవుతుండటంతో మళ్లీ ఐటమ్ గర్ల్ గా ఓ వెలుగు వెలగాలని ఆమె భావిస్తోంది. ఈ క్రమంలోనే అవకాశాలు వస్తాయని ఆమె ఎంతో నమ్మకంగా ఉంది.
Must Read ;- పందిమాంసం అంటే మిక్కిలి మక్కువ అంటోన్న కన్నడ బ్యూటీ