టీఆర్ఎస్ పార్టీ వార్షికోత్సవ దినోత్సవాన్ని పురస్కరించుకొని టీఆర్ఎస్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలకు, పార్టీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మంత్రి హరీశ్ రావు మాత్రం ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘ఒక సాహసం చరిత్ర గతిని మార్చింది. ఒక త్యాగం మరో చరిత్రను సృష్టించింది. కేసిఆర్ ఉక్కు సంకల్పం 60 ఏండ్ల కలను సాకారం చేసింది. 20యేళ్లుగా కేసిఆర్ బాటలో నడుస్తున్న సైనికుడికి ఇదొక జీవిత కాల సాఫల్యం అని భావోద్వేగమైన ట్వీట్ చేశారు మంత్రి హరీష్ రావు. అప్పట్లో కేసీఆర్ తో దిగిన ఫొటోను షేర్ చేశారు.
ఉద్యమం నిప్పురవ్వగా మోదలైనరోజులు తలుచుకుంటే మనసు గర్వంతో నిండిపోతుంది. ఉద్యమం దావానలమై లక్ష్యాన్ని ముద్దాడినప్పుడు జన్మధన్యమైన సంతృప్తి. 20యేళ్లుగా కేసిఆర్ గారి బాటలో నడుస్తున్న సైనికుడికి ఇదొక జీవిత కాల సాఫల్యం.#TRSFormationDay #20YearsOfTRS pic.twitter.com/4XgRHvNDWB
— Harish Rao Thanneeru (@trsharish) April 27, 2021