August 18, 2026 11:37 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

తెలుగులో నా ఫేవరేట్ హీరో అతనే: ముత్తయ్య మురళీధరన్

భాషలకు, దేశాలకు అతీతంగా తన ఆటతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న లెజెండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్. ఆయన జీవితం ఆధారంగా రూపొందిన సినిమా '800'. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800ల వికెట్లు తీసిన ఏకైక క్రికెటర్ ఆయనే. ఆ రికార్డును గుర్తు చేసేలా టైటిల్ పెట్టారు.

September 27, 2023 at 3:48 PM
in Cinema
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఎంఎస్ శ్రీపతి దర్శకత్వంలో మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. ప్రముఖ నిర్మాత, శ్రీదేవి మూవీ పిక్చర్స్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో అక్టోబర్ 6న సినిమా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా తెలుగు మీడియాతో ముత్తయ్య మురళీధరన్ ముచ్చటించారు. ఆ విశేషాలు…

మీ జీవితాన్ని తెరకెక్కిస్తామని వచ్చినప్పుడు మీ స్పందన ఏమిటి? లేదంటే మీరే సంప్రదించారా?
ముత్తయ్య మురళీధరన్ : అంతా యాదృశ్చికంగా జరిగింది. నా జీవితాన్ని సినిమా తీయాలని ఎప్పుడూ అనుకోలేదు. శ్రీలంక ప్రజలకు సహాయం చేయడం కోసం 20 ఏళ్ళ క్రితం నేను ఫౌండేషన్ స్థాపించాను. దాని ద్వారా ఎంతో మందికి సాయం అందించాం. మా సేవా కార్యక్రమాలను గూగుల్ చేసి చూడవచ్చు. దర్శకుడు వెంకట్ ప్రభు 2008లో ఒకసారి తమిళ ప్రజలకు సహాయం చేయడానికి వచ్చారు. అప్పుడు ఆయనతో పాటు శ్రీపతి, ఇంకో ఇద్దరు ఉన్నారు. నా వైఫ్ మదిమలర్, వెంకట్ ప్రభు చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్ కావడంతో మమ్మల్ని కలిశారు. నా ట్రోఫీలు, సాధించిన ఘనతలు చూసి బయోపిక్ తీద్దామని ప్రతిపాదన తెచ్చారు. నేను వద్దని చెప్పా. ఫౌండేషన్ కోసం ఏదైనా చేయవచ్చని నా మేనేజర్ కన్వీన్స్ చేశారు. సరే అన్నాను.

అప్పుడు శ్రీపతిని కథ రాయమని వెంకట్ ప్రభు చెప్పారు. కొన్ని కారణాల వల్ల వెంకట్ ప్రభు, నిర్మాత సినిమా చేయలేదు. శ్రీపతితో స్క్రిప్ట్ ఫినిష్ చేయమని చెప్పా. తర్వాత విజయ్ సేతుపతి హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ సినిమా చేయాలని ప్లానింగ్ జరిగింది. అప్పుడు ఏమైందో అందరికీ తెలుసు. నాతో పాటు చాలా రోజులు ట్రావెల్ చేసిన, నా గురించి బాగా తెలిసిన, స్క్రిప్ట్ రాసిన శ్రీపతిని డైరెక్ట్ చేయమని చెప్పా. తర్వాత మధుర్ మిట్టల్ వచ్చారు. కరోనా వల్ల కొంత ఆలస్యమైంది. సినిమా పూర్తైన తర్వాత శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణప్రసాద్ ముందుకు వచ్చారు. నా జీవితంలో ఎత్తుపల్లాలు ఎలా అయితే ఉన్నాయో… ఈ సినిమాను అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని నిర్ణయించడం వెనుక అదే విధంగా ఎత్తుపల్లాలు ఉన్నాయి.

బయోపిక్ అంటే చాలా బాధ్యత ఉంటుంది. యువతకు స్ఫూర్తి ఇచ్చేలా ఉండాలి. ఆ విషయంలో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
నేను బయోపిక్ తీయడానికి రైట్స్ ఇచ్చాను. స్క్రిప్ట్ నాలుగైదుసార్లు చదివా. ఇందులో ఎటువంటి మసాలా ఉండకూడదని బలంగా నిర్ణయించుకున్నా. ఆ విషయం దర్శక నిర్మాతలకు చెప్పా. సినిమాలో నిజంగా జరిగిన కథ మాత్రమే ఉండాలని దర్శకుడికి షరతు విధించా. నిజమైన కథ లేకపోతే అది బయోపిక్ కాదు. నా జీవితమే సినిమాలా ఉంటుంది. మంచి చెడుతో పాటు చాలా విషయాలు జరిగాయి. మంచి స్క్రిప్ట్ రైటర్ కూడా ఇంత మంచి కథ రాయగలడని అనుకోను.

బయోపిక్ అంటే ఫిక్షన్ యాడ్ చేస్తారు. లేదంటే డాక్యుమెంటరీ అవుతుందని చెబుతారు. ఈ సినిమాలో ఎంత ఫిక్షన్ ఉంది?
నో ఫిక్షన్! ఈ సినిమాలో క్రికెట్ 20 శాతమే ఉంటుంది. మిగతా 80 శాతం అంతా నా లైఫ్ ఉంటుంది. నా ప్రయాణం, నేను ఇన్ని ఘనతలు సాధించిన క్రమంలో నా కుటుంబం, దేశం ఎదుర్కొన్న పరిస్థితులు ‘800’లో చూపించాం. నా బాల్యం, సెలెక్టర్లు నన్ను ఎందుకు సెలెక్ట్ చేశారు? వంటివి ఎవరికీ తెలియవు. అటువంటి విషయాలు ఎక్కువ ఉంటాయి.

మీ పాత్రకు మధుర్ మిట్టల్ ఎంత వరకు న్యాయం చేశారు?
నిజం చెప్పాలంటే… రెండుసార్లు మాత్రమే అతడిని కలిశా. ట్రైనింగ్ జరిగేటప్పుడు కూడా వెళ్ళలేదు. ఆ బాధ్యత అంతా దర్శకుడు చూసుకున్నారు. నేను ఇన్వాల్వ్ అవ్వాలని అనుకోలేదు. టీజర్, ట్రైలర్ చూశా. నాలా 70 పర్సెంట్ చేశాడు. లుక్స్ పరంగా 60, 70 పర్సెంట్ మ్యాచ్ చేశాడు.

అదేంటి మీరు సినిమా చూడలేదా?
లేదు. నేను చాలా పెద్ద మూవీ ఫ్యాన్. ఇండియన్ మూవీస్ మిస్ కాను. రషెస్ కంటే మూవీ చూడాలని అనుకున్నా. అప్పుడు మాత్రమే ఎంజాయ్ చేయగలను.

ఎప్పుడూ సెట్ కు వెళ్లలేదా? ఎలా తీస్తున్నారో చూడలేదా?
ఒక్కసారి మాత్రమే వెళ్లా. మా పేరెంట్స్ ఇంటిలో షూటింగ్ చేస్తున్నారు. అప్పుడు నేను ఆ ఇంటికి దగ్గరలో ఉన్నాను. అందుకని, వెళ్లా. మూవీ మేకింగ్ గురించి నాకు ఏమీ తెలియదు. అది డిఫికల్ట్ ఆర్ట్. నాకు సినిమాలు చూడటమే ఇష్టం. కొన్నిసార్లు నిర్మాతలను చూస్తే బాధగా ఉంటుంది. నటీనటులతో పాటు అందరికీ డబ్బులు ఇస్తారు. ఒకవేళ సినిమా ఆడకపోతే వాళ్ళ డబ్బులే పోతాయి కదా!

సినిమా హిట్ కావచ్చు, ఫ్లాప్ అవ్వొచ్చు. అందుకని, చాలా మంది క్రికెటర్లు తమ బయోపిక్ తీయాలని కోరుకోరు!
ఒక్కటి చెబుతా.. వజ్రాల కోసం భూమిలో వెతుకుతారు కదా! లోతుగా తవ్వుతారు. చాలా డబ్బులు ఖర్చు పెడతారు. కొన్నిసార్లు ఒక్క వజ్రం మాత్రమే లభిస్తుంది. చాలాసార్లు వజ్రాలు లభించవు. సినిమా కూడా అంతే! విజయంలో చాలా అంశాలు ఉంటాయి. సినిమా ఫ్లాప్ అయితే నా లెగసీ ఏమీ కింద పడదు. నా లెగసీ క్రికెట్! నిజంగా జరిగిన కథను ప్రజలకు చెప్పాలని మేం చేసిన ప్రయత్నం ‘800’. అది కొందరికి నచ్చవచ్చు. కొందరికి నచ్చకపోవచ్చు. చిత్ర పరిశ్రమలో 35 ఏళ్ళ అనుభవం ఉన్న శివలెంక కృష్ణప్రసాద్ గారు ప్రపంచవ్యాప్తంగా సినిమాను ప్రజెంట్ చేస్తూ రిలీజ్ చేస్తున్నారు. ఇదొక మంచి సినిమా. తప్పకుండా అందరికీ నచ్చుతుంది.

శ్రీలంకలో సినిమాను విడుదల చేస్తున్నారా?
చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా తమిళ, తెలుగు, హిందీ, సింహళీ భాషల్లో విడుదల అవుతోంది. శ్రీలంక ప్రజల్లో చాలా మంది విదేశాల్లో ఉంటున్నారు. వాళ్ళ కోసం మేం సింహళీ భాషలో కూడా విడుదల చేస్తున్నాం. శ్రీలంకలో సింహళీ వెర్షన్‌ విడుదల చేస్తున్నాం.

మీరు తెలుగు సినిమాలు చూస్తారా?
శ్రీలంకలో తెలుగు సినిమాలు విడుదల కావు. తమిళ, హిందీ సినిమాలు విడుదల అవుతాయి. ఆ భాషల్లో డబ్బింగ్ చేసిన తెలుగు సినిమాలు చూస్తాం. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ సినిమాలను పాన్ ఇండియా రిలీజ్ చేశారు. హిందీ, తమిళ భాషల్లో కూడా విడుదల చేశారు. అవి చూశాం. ఇప్పుడు తెలుగు సినిమాలకు ఆదరణ పెరుగుతోంది. శ్రీలంకలో బాలీవుడ్ మూవీస్ ఫేమస్. అక్కడ వాళ్ళకు హిందీ తెలుసు. ఇప్పుడు పరిస్థితి మారింది. తెలుగు సినిమా టాప్ పొజిషన్‌కు చేరుకుంది.

మీకు ఇష్టమైన తెలుగు నటుడు?
ఇతర భాషలతో పోలిస్తే తెలుగులో సూపర్ హీరోస్, స్టార్ హీరోస్ ఎక్కువ మంది ఉన్నారు. అయితే… నేను నాని సినిమాలు ఎక్కువ చూశా! ‘శ్యామ్ సింగ రాయ్’ చూశా. ‘ఈగ’, ‘జెర్సీ’తో పాటు చాలా సినిమాలు చూశా. డబ్బింగ్ సినిమాలు కనుక తెలుగు టైటిల్స్ ఎక్కువ గుర్తు లేవు. ఆయన నటన అంటే ఇష్టం. యాక్షన్ హీరో కాదు… డ్రామా, ఎమోషన్స్ ఉంటాయి. నేచురల్ స్టార్!

వెంకట్ ప్రభు, మీ వైఫ్ మదిమలర్ చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్ అన్నారు కదా! మీ మామ గారికి తమిళ పరిశ్రమలో చాలా మంది తెలుసు. మీకు వాళ్ళు పరిచయమేనా?
మదిమలర్ తండ్రి రామమూర్తి ఇప్పుడు లేరు. కానీ, ఆయన గురించి చాలా మందికి తెలుసు. చెన్నైలో మలర్ హాస్పిటల్స్ వాళ్ళవే. ఇప్పటికీ షేర్స్ ఉన్నాయి. కార్తీ హీరోగా ఆయన ఒకట్రెండు సినిమాలు నిర్మించారు. ‘చంద్రముఖి’ దర్శకులు పి. వాసు, రామమూర్తి మంచి స్నేహితులు. అలాగే, చంద్రశేఖర్ కూడా! చంద్రశేఖర్ ద్వారా నాకు మదిమలర్ మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది. సన్ టీవీ కళానిధి మారన్ గారు, సీఈవో షణ్ముగం, ఇంకా చాలా మంది నాకు పరిచయమే.

సినిమా విడుదలకు ముందు మీకు ఏమనిపిస్తోంది?
ఎప్పటిలా నార్మల్ గా ఉన్నాను. నేను ఎందుకు టెన్షన్ పడాలి? ఒకవేళ నేను వరల్డ్ కప్ ఫైనల్ ఆడుతుంటే టెన్షన్ పడాలి.

త్వరలో వరల్డ్ కప్ మొదలు కాబోతోంది. మీ ఫేవరేట్ టీమ్ ఏది?
శ్రీలంక మాత్రమే నా ఫేవరేట్. ఇండియన్ టీమ్ క్లియర్ ఫేవరేట్ అని తెలుస్తోంది. ఆస్ట్రేలియా టీమ్ కూడా బావుంది. అయితే… ఎవరు గెలుస్తారనేది ఇప్పుడే చెప్పలేం. విజయం వరించాలంటే అదృష్టం కూడా ఉండాలి. లాస్ట్ వరల్డ్ కప్ న్యూజిలాండ్ విన్ అవుతుందని అనుకున్నారు. లక్కీగా ఇంగ్లాండ్ నెగ్గింది.

Tags: He is my favourite hero in Telugu: Muthiah Muralidaranleotop
Previous Post

‘దేశం’ ను ఏమార్చి దొంగఓట్లు

Next Post

నిస్సహాయంగా…. వ్యవస్థలు

Related Posts

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

by లియో డెస్క్
March 26, 2026 7:57 pm

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జనసేన నేత హ*త్యకు కోటిన్నర సుపారీ..వైసీపీ నేత కుట్ర!

భోగాపురం రన్‌వే అదుర్స్..గాల్లోకి ఎగిరిన తొలి ఫ్లైట్.!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

తొలి జీతం.. అమరవీరుల కుటుంబాలకు.. ఎంపీ చింతకాయల విజయ్‌ గొప్ప మనసు..

వేమూరి రాధాకృష్ణకు సతీ వియోగం

Lavanya Tripathi

బన్నీ హై వోల్టేజ్ యాక్షన్

నానీని అంతలా ఆకట్టుకున్న కామెడీ ఏమిటో?

బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న నాగచైతన్య

Megastar Chiranjeevi New Look Very Charm & Stylish

ముఖ్య కథనాలు

జనసేన నేత హ*త్యకు కోటిన్నర సుపారీ..వైసీపీ నేత కుట్ర!

భోగాపురం రన్‌వే అదుర్స్..గాల్లోకి ఎగిరిన తొలి ఫ్లైట్.!

తొలి జీతం.. అమరవీరుల కుటుంబాలకు.. ఎంపీ చింతకాయల విజయ్‌ గొప్ప మనసు..

అమరావతికి రాచబాట..సీడ్ యాక్సెస్ రోడ్ రెడీ..!

ఫేక్ అకౌంట్లతో వైసీపీ కుట్ర.. కార్యకర్తలకు కూటమి వార్నింగ్.!

జగన్‌ కూతురు పొలిటికల్‌ ఎంట్రీ.. అవినాష్‌ రెడ్డి గుండెల్లో దడ..!

లోకేష్ బ్రాండ్‌పై వైసీపీ అక్కసు.. నకిలీ జీవోలతో డ్రామా..!

ఏపీకి డబుల్ ధమాకా..విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు లైన్ క్లియర్..!

మెగా DSCపై వైసీపీవి డ్రామాలు..కాంగ్రెస్ నేత చింతా మోహన్ సంచలనం..!

లేడీ సింగమ్స్ దెబ్బ..వైసీపీ నేత చింతాడను నడిరోడ్డుపై నడిపిస్తూ కోర్టుకు.!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జనసేన నేత హ*త్యకు కోటిన్నర సుపారీ..వైసీపీ నేత కుట్ర!

భోగాపురం రన్‌వే అదుర్స్..గాల్లోకి ఎగిరిన తొలి ఫ్లైట్.!

తొలి జీతం.. అమరవీరుల కుటుంబాలకు.. ఎంపీ చింతకాయల విజయ్‌ గొప్ప మనసు..

అమరావతికి రాచబాట..సీడ్ యాక్సెస్ రోడ్ రెడీ..!

ఫేక్ అకౌంట్లతో వైసీపీ కుట్ర.. కార్యకర్తలకు కూటమి వార్నింగ్.!

జగన్‌ కూతురు పొలిటికల్‌ ఎంట్రీ.. అవినాష్‌ రెడ్డి గుండెల్లో దడ..!

లోకేష్ బ్రాండ్‌పై వైసీపీ అక్కసు.. నకిలీ జీవోలతో డ్రామా..!

ఏపీకి డబుల్ ధమాకా..విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు లైన్ క్లియర్..!

మెగా DSCపై వైసీపీవి డ్రామాలు..కాంగ్రెస్ నేత చింతా మోహన్ సంచలనం..!

లేడీ సింగమ్స్ దెబ్బ..వైసీపీ నేత చింతాడను నడిరోడ్డుపై నడిపిస్తూ కోర్టుకు.!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

జనసేన నేత హ*త్యకు కోటిన్నర సుపారీ..వైసీపీ నేత కుట్ర!

భోగాపురం రన్‌వే అదుర్స్..గాల్లోకి ఎగిరిన తొలి ఫ్లైట్.!

తొలి జీతం.. అమరవీరుల కుటుంబాలకు.. ఎంపీ చింతకాయల విజయ్‌ గొప్ప మనసు..

అమరావతికి రాచబాట..సీడ్ యాక్సెస్ రోడ్ రెడీ..!

ఫేక్ అకౌంట్లతో వైసీపీ కుట్ర.. కార్యకర్తలకు కూటమి వార్నింగ్.!

జగన్‌ కూతురు పొలిటికల్‌ ఎంట్రీ.. అవినాష్‌ రెడ్డి గుండెల్లో దడ..!

లోకేష్ బ్రాండ్‌పై వైసీపీ అక్కసు.. నకిలీ జీవోలతో డ్రామా..!

ఏపీకి డబుల్ ధమాకా..విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు లైన్ క్లియర్..!

మెగా DSCపై వైసీపీవి డ్రామాలు..కాంగ్రెస్ నేత చింతా మోహన్ సంచలనం..!

లేడీ సింగమ్స్ దెబ్బ..వైసీపీ నేత చింతాడను నడిరోడ్డుపై నడిపిస్తూ కోర్టుకు.!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist