నానబెట్టిన బాదంపప్పులు మొత్తం జీర్ణక్రియను సులభతరం చేసి వేగంగా జీర్ణప్రక్రియ సజావుగా సాగేలా చేస్తాయి. బాదంపప్పులను నీటిలో నానబెట్టినపుడు, పైన తొక్కు తీసేయడం వలన సులువుగా జీర్ణమై, ఎక్కువ పోషకాలు అందుతాయి.
- ప్రెగ్నెన్సీ ఉన్న మహిళలు తప్పనిసరిగా తినాల్సింది ఏదైనా ఉందంటే.. ముందుగా బాదం అనే చెప్పాలి. ఎందుకంటే ఇవి మీ బేబీ ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. నానబెట్టిన బాదంపప్పులు తల్లికి, బిడ్డకి అన్నిటికన్నా ఎక్కువ పోషణ, శక్తిని అందిస్తాయి. అంతేకాక బాదంపప్పులలోని ఫోలిక్ యాసిడ్ పుట్టుకతో వచ్చే లోపాలను నివారిస్తాయి. 4 నుంచి 6 బాదంపప్పులు రోజూ తినటం వలన మెదడుకి టానిక్ లాగా పనిచేసి, కేంద్రనాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేసేలా చేస్తుంది. అందుకని, పొద్దున్నే బాదం తినటం వలన మీ జ్ఞాపకశక్తి చురుగ్గా మారి, మెదడు పనితీరు మెరుగవుతుంది.
- నానబెట్టిన బాదంపప్పులలో ప్రొటీన్, పొటాషియం మరియు మెగ్నీషియం ఉండి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచి, తీవ్ర ప్రాణాంతక గుండె జబ్బులతో పోరాడటంలో సాయపడతాయి. మీ మొండి పొట్ట కొవ్వును కరిగించటానికి నానబెట్టిన బాదంలను మీ డైట్ లో జతచేసుకోండి. నానబెట్టిన బాదంపప్పులు పై తొక్కు తీసేయటం వలన బరువు తగ్గటం వేగతరం చేస్తాయి. నానబెట్టిన బాదంలలో మోనోసాచ్యురేటడ్ కొవ్వులుండి మీ ఆకలిని తగ్గించి, కడుపు నిండుగా ఉంచుతాయి.
- Must Read ;- క్యారెట్ తింటే.. ఎన్ని లాభాలో తెలుసా?