Health Benefits of Guava Fruit :
అన్ని సీజన్లలో దొరికే పండు ఎదైనా ఉందంటే.. అది జామపండే. మిగతా పండ్లతో పోల్చితే.. జామ రేటు కూడా తక్కువే. జామపండు తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.
రెటీనా దెబ్బతినకుండా..
కంటి ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి విటమిన్ ఎ చాలా అవసరం. కాబట్టి.. జామ పండు కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కంటి సమస్యలను నివారించి, కంటి చూపును మెరుగుపరుస్తుంది. జామపండులో లభించే అధిక యాంటీ ఆక్సిడెంట్స్.. ఫ్రీ రాడికల్స్ నుండి కళ్ళను రక్షించడంలో సాయపడుతుంది. మరియు రెటీనా దెబ్బతినకుండా రక్షిస్తుంది.అందువల్ల, జామ దృష్టిని మెరుగుపరుస్తుంది. ఈ పండులో కేలరీలు తక్కువగా ఉండి పీచు పదార్ధం ఎక్కువగా ఉంటుంది.
గర్భిణులకు మేలు
జామ పండులో ఫోలిక్ ఆమ్లం, విటమిన్ బి -9 ఉంటుంది. ఇది శిశువు నాడీ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో సాయపడుతుంది. కాబట్టి గర్భిణీలకు జామ పండు ఆరోగ్యకరమైనది. ఇది నవజాత శిశువును నాడీ సంబంధిత రుగ్మతల నుంచి కాపాడుతుంది.
క్యాన్సర్ రాదట..
జామపండు కాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందట. జామ పండులో ఉండే లైకోపీన్, క్వెర్సెటిన్, విటమిన్ సి, ఇతర పాలీఫెనాల్స్ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి, ఇవి శరీరంలో ఉత్పత్తి అయ్యే ఫ్రీ రాడికల్స్‌ను తగ్గిస్తాయి. అంతేకాకుండా కాన్సర్ కణాల పెరుగుదలను నివారించడంలో కూడా ఇది సాయపడుతుంది. జామ పండు ప్రోస్టేట్ కాన్సర్, రొమ్ము కాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది.
సంతాన సమస్యలు దూరం
జామలోని పోషకాలు సంతాన సమస్యలను దూరం చేస్తాయి. ఇది సంతానోత్పత్తిని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. పొటాషియం బీపీని కంట్రోల్‌లో ఉంచుతుంది. అంతేకాకుండా… నొప్పి, వాపు చిగుళ్ళు, నోటి పూతలను నయం చేస్తుంది. ఈ పండులో విటమిన్ సి, లైకోపీన్, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి.
యవ్వనంగా…
జామ పండులో విటమిన్ ఎ, విటమిన్ సి, కెరోటిన్, లైకోపీన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి. చర్మ సంరక్షణలో జామకాయ కీ రోల్ పోషిస్తుంది, ఇవన్నీ మీ చర్మానికి మేలు చేస్తాయి. అంతేకాకుండా వృద్ధాప్యాన్ని తగ్గిస్తాయి మరియు చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి.
Health Benefits of Guava Fruit :
- జామ పండ్ల ఆకుల రసం తాగితే… మన శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ క్రమపద్ధతికి చేరతాయి. చాలా ఎక్కువసేపు బ్లడ్ షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది. డయాబెటిస్ ఉండేవారికి ఇది ఎంతో మేలు చేసే అంశం. అందువల్ల భోజనం తర్వాత జామ ఆకుల టీ తాగితే కలిసొస్తుంది. దాదాపు రెండు గంటలపాటూ బ్లడ్ షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది.
- జామ ఆకుల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు… విషవ్యర్థాలను చంపేసి… గుండెకు మేలు చేస్తాయి. జామకాయల్లోని పొటాషియం, కరిగిపోయే ఫైబర్… గుండెను కాపాడతాయి. జామ ఆకులు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.
- పీరియడ్స్ టైమ్‌లో చాలా మంది మహిళలు పొట్టలో నొప్పి వస్తున్నట్లు బాధపడతారు. జామ ఆకుల రసం ఈ నొప్పులను అదుపుచేస్తుంది.
- జామకాయల్లో కేలరీలు తక్కువ. అందువల్ల ఇవి తింటే ఆకలి తీరుతుంది. అలాగే ఎక్కువ కేలరీలు బాడీకి చేరవు. పైగా వీటిలోని విటమిన్లు, మినరల్స్ మేలు చేస్తాయి.
- Also Read:- సూర్య నమస్కారాలతో.. అందం, ఆనందం, ఆరోగ్యం!











