అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డికి ఇనస్టాగ్రామ్ లో అత్యథికంగా 4 మిలియన్ ఫాలోవర్స్ వచ్చాయి. సెలబ్రిటీ భార్యల్లో ఇదే అత్యథికం. ఈ సంగతి పక్కనపెడితే.. భారతీయ హీరోయిన్లలో టాప్ ఎవరు? దీనికి ఒకే ఒక్క సమాధానం ప్రియాంక చోప్రా. ఆమెకు ఏకంగా 64.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ప్రియాంక చోప్రాకు గ్లోబల్ హీరోయిన్ ఇమేజ్ ఉంది. ఆమె కేవలం బాలీవుడ్ నటి కాదు, హాలీవుడ్ స్థాయికి వెళ్లింది. అందుకే ఆమెకు ఈ స్థాయిలో ఫాలోవర్స్ ఉన్నారు. రోజురోజుకు ఆమెకు వేలల్లో ఫాలోవర్స్ పెరుగుతున్నారు.
ప్రియాంక చోప్రా తర్వాత స్థానంలో నిలిచింది శ్రద్ధా కపూర్. ఊహించని విధంగా ఈ ముద్దుగుమ్మకు ఇనస్టాగ్రామ్ లో క్రేజ్ పెరిగింది. ప్రియాంకకు పోటీగా ఏకంగా 62.8 మిలియిన్ ఫాలోవర్స్ తో దూసుకుపోతోంది శ్రద్ధా కపూర్. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫొటోలతో శ్రద్ధా నిత్యం యాక్టివ్ గా ఉంటుంది.
ఇక లిస్ట్ లో మూడో స్థానంలో నిలిచిన భామ దీపిక పదుకోన్. ఈ బ్యూటీకి ఇండియా అంతటా ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె లాంగ్ లెగ్స్ కు ఫిదా అవ్వని సినీప్రేక్షకుడు లేడు. అందుకే ఆమెకు అంత ఫాలోయింగ్. ప్రస్తుతం దీపిక పదుకోన్ కు 57.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.
ఇక టాప్-5లో ప్రియాంక, శ్రద్ధ, దీపికతో పాటు అలియా భట్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా ఉన్నారు. అలియా భ ట్ 53.5 మిలియన్ ఫాలోవర్స్ తో నాలుగో స్థానంలో, జాక్వెలిన్ 52.1 మిలియన్ ఫాలోవర్స్ తో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఇనస్టాగ్రామ్ లో అత్యథికంగా ఫాలోయింగ్ కలిగిన టాప్-10 భామల లిస్ట్ ఇలా ఉంది..
Must Read ;- ఇన్ స్టా పై అందాల దండయాత్ర చేస్తోన్న రత్తాలు
1. ప్రియాంక చోప్రా – 64.5 మిలియన్ ఫాలోవర్స్
2. శ్రద్ధా కపూర్ – 62.8 మిలియన్ ఫాలోవర్స్
3. దీపిక పదుకోన్ – 57.1 మిలియన్ ఫాలోవర్స్
4. అలియా భట్ – 53.5 మిలియన్ ఫాలోవర్స్
5. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ – 52.1 మిలియన్ ఫాలోవర్స్
6. అనుష్క శర్మ – 50.4 మిలియన్ ఫాలోవర్స్
7. కత్రినాకైఫ్ – 50.3 మిలియన్ ఫాలోవర్స్
8. దిశా పటానీ – 44.4 మిలియన్ ఫాలోవర్స్
9. కృతి సనన్ – 39.7 మిలియన్ ఫాలోవర్స్
10. ఊర్వశి రౌథేలా – 38 మిలియన్ ఫాలోవర్స్











