ఆర్ఎక్స్ 100 కార్తికేయ ‘చావు కబురు చల్లాగా’ కాకుండా కాస్త వేడిగానే చెప్పేస్తున్నారు. జనవరి 11 ఉదయం ఈ సినిమా టీజర్ గ్లిమ్స్ విడుదలవుతోంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాతగా ఈ సినిమా రూపొందింది. ఇందులో హీరో కార్తికేయకు జంటగా లావణ్య త్రిపాఠి నటిస్తోంది. కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ కూ, హీరో కార్తికేయ ‘బస్తీ బాలరాజు’ ఫస్ట్ లుక్ కు కూడా మంచి స్పందన లభించింది.
ఈ సినిమా టీజర్ గ్లింప్స్ జనవరి 11 ఉదయం 10.56 గంటలకు విడుదల చేస్తారు. కార్తికేయ ఫుల్ మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. జకీస్ బీజాయ్ సంగీతం ప్రత్యేక ఆకర్షణ అంటున్నారు. ఇంతకుముందు జిఏ2 పిక్చర్స్ బ్యానర్ లో భలేభలే మగాడివోయ్, గీతాగోవిందం, ప్రతిరోజూ పండగే చిత్రాలు మంచి విజయాలు నమోదు చేశాయి. ఇందులో లావణ్య త్రిపాఠి మల్లిక అనే పాత్రను పోషించింది. వచ్చే వేసవిలో ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు.
Must Read ;- నేను నేర్చుకున్న పాఠం అదే .. !