పండుగ నాడు వినోదమా? పాపం..! మహాపాపం..!!
పండుగ నాడు వినోదం అంటే ఏపీలో కుదరదు! వినోదం అంటే ఇక్కడ పాపమే! అదేదో మహాపాపంగా జగన్ రెడ్డి ప్రభుత్వం భావించినా.. ఆశ్చర్యపొనక్కర్లేదు! ఎందుకంటే జగన్ చర్యలకు ఏపి వ్యాప్తంగా సినిమా థియేటర్లు మూసివేత దిశగా అడుగులు పడుతున్నాయి. ఏపిలో ఉన్న 1000 థియేటర్లకు పైగా నేడు ఆ చర్యలకు మగ్గిపోతున్నాయి. ఇప్పటికే 315 థియేటర్లు స్వచ్ఛందంగా మూసివేత దిశగా ముందుకు సాగుతున్నాయి. థియేటర్లు మూసివేస్తే .. మహా అయితే లాభాలు రావు.. అంతేకాని మాకేం నష్టంలేదుగా అంటూ యాజమాన్యాలు కూడా మొండికి దిగుతున్నాయి. దీని కారణంగా ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత పెల్లుబుకుతోంది! అధిక శాతం మంది ప్రజలు అధికార పార్టీ నాశనాన్ని కోరుతున్నారు! దీంట్లో ఎటువంటి సందేహం లేదన్నదే వాస్తవం..!! హిందూ పండుగలలో అతిపెద్ద పండుగు సంక్రాంతి.. మూడు రోజులు ఎంతో వైభవంగా నిర్వహించుకోవడం ఆనవాయితీ! అటువంటి పండుగంటే.. కొత్త అల్లుళ్లు, పిండివంటలు, కోడిపందేలు వంటివే కాదు.. అభిమాన హీరో మంచి సినిమా కూడా భాగమే! ఇటువంటి పరిస్థితిలో ఎక్కడి నుంచో సొంత ఊర్లకు వచ్చేవారికి వారి ప్రాంతాల్లో థియేటర్లు మూసివేత బోర్డులు దర్శనిమివ్వడం తీవ్ర అసంతృప్తిని రాజేస్తున్నాయి. పండుగ నాడు సినిమా చూడాలంటే ఎక్కడ చూడాలి? పెద్ద ఎత్తున ప్రజలు నిలదీస్తున్నారు. తాగేందుకు నకిలీ బ్రాండ్స్ తప్పా.. నాణ్యమైన మద్యంలేదు..! వినోదానికి మంచి సినిమా థియేటర్లు లేవు..!! ఇలా మనిషి జీవితంతో ప్రధాన భూమిక పోషించేవన్నీ సర్వనాశనం అవుతుంటే.. ఏపీ ప్రజలు ఏం కావాలి? ఎక్కడకు పోవాలి? అన్న ప్రశ్నలే రాష్ట్ర వ్యాప్తంగా ఉత్పన్నమవుతున్నాయి.
సిని, రాజకీయ ప్రముఖులు స్పందనలు అందుకే..!
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో రావు రమేష్.. మహేష్ బాబును పట్టుకుని.. ‘మీ అన్నను మంచి డాక్టర్ వద్ద చూపించండిరా.. అలా వదిలేయ్యకండ్రా.. బాబు’ అని ఎంతో నిరుత్సాహంతో చెబుతాడు. అలానే ఏపీలో పరిస్థతులు దాపురించాయి. అటువంటి పరిస్థితే నేడు ఏపీ పాలకుల చర్యలు చూసి ప్రజలకు ఆ డైలాగ్ గుర్తోస్తోంది! సీఎం జగన్ రెడ్డి పక్కనుండి ఇటువంటి దౌర్భగ్యమైన ఆలోచనలిస్తున్న వాడిని చెప్పుతో కొట్టాలని సోషల్ మీడియాలో నెటిజన్లు చేస్తున్న కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి! మొన్న హీరోలు నాని, సిద్ధార్థ్ లు తనదైన శైలిలో స్పందిస్తే .. నిన్న (ఆదివారం) హీరో నిఖిల్ కూడా తనదైన రీతిలో స్పందించారు. తెలంగాణ లో టికెట్ ధరను పెంచుకోవచ్చని జీవో జారీ చేస్తే.. ఏపీలో మాత్రం సినిమా థియేటర్లు మూసివేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం టికెట్ ప్రైస్ పై తగు నిర్ణయం తీసుకుంటే బాగుటుందని .. దేవుడి గుళ్లులాంటి సినిమా థియేటర్లు అలా మూసివేస్తుంటే.. గుండె తరుక్కుపోతోందని అవేదన వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం టికెట్ల ధరలను మరీ తక్కువ చేయకపోయినా కూడా టికెట్ల ధరలు ప్రేక్షకులకు అందుబాటు ధరలోనే ఉన్నాయని నిఖిల్ అభిప్రాయపడ్డారు. సినిమాలు థియేటర్లలో ఆడేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతలు తెలిపారు
Must Read ;- జగన్ రెడ్డి ప్రభుత్వానికి మరో చెంపదెబ్బ..! సినిమా టికెట్ ధరల జీవో సస్పెండ్!!.