యంగ్ హీరో నిఖిల్ ఎర్లియర్ గా ‘అర్జున్ సురవరం’ అనే సినిమాతో డీసెంట్ హిట్ కొట్టాడు. సర్టిఫికెట్స్ స్కాం నేపథ్యంలో రూపొందినఈ సినిమా ప్రేక్షకుల్ని భలేగా థ్రిల్ చేసింది. ప్రస్తుతం ఈ హీరో ‘కార్తికేయ 2, 18 పేజెస్’ మూవీస్ ను ఒకేసారి ట్రాక్ మీద పెట్టుకున్నాడు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రస్తుతం ఈ రెండు సినిమాల షూటింగ్స్ తాత్కాలికంగా ఆగిపోయాయి.
నేడు హీరో నిఖిల్ పుట్టిన రోజు సందర్భంగా ‘18 పేజెస్’ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. కథానాయిక అనపమా పరమేశ్వరన్ .. నిఖిల్ కళ్ళ మీద ఒక పేపర్ స్ట్రిప్ నుంచి.. దాని మీద పెన్నుతో ఏదో రాస్తున్నట్టుగా రివీలైన ఈ పోస్టర్ .. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో అనుపమా పరమేశ్వరన్ ఎంతో అందంగా ట్రెడిషనల్ గా కనిపిస్తోంది.
‘నా పేరు నందిని. నాకు మొబైల్లో అక్షరాలను టైప్ చెయ్యడం కన్నా ఇలా కాగితం పై రాయడం ఇష్టం. టైప్ చేసే అక్షరాలకి ఎమోషన్స్ వుండవు ఎవరు టైప్ చేసినా ఒకేలా ఉంటాయి. కానీ రాసే ప్రతి అక్షరానికి ఒక ఫీలింగ్ ఉంటుంది. దాని పై నీ సంతకం ఉంటుంది. నాకెందుకో ఇలా చెప్పడమే బాగుంటుంది’ అని ఆ స్ట్రిప్ మీద రాసినట్టు రివీలవడం ఆకట్టుకుంటోంది. జీఏ 2, సుకుమార్ రైటింగ్స్ సంయుక్త బ్యానర్స్ పై నిర్మాణం జరుపుకుంటోన్న ఈ సినిమాకి కుమారి 21 ఫేమ్ సూర్య ప్రతాప్ పల్నాడు దర్శకుడు. మరి ఈ సినిమా నిఖిల్ కు , అనుపమాకి ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.
నా పేరు నందిని. నాకు మొబైల్లో అక్షరాలను టైప్ చెయ్యడం కన్నా ఇలా కాగితం పై రాయడం ఇష్టం. టైప్ చేసే అక్షరాలకి ఎమోషన్స్ వుండవు ఎవరు టైప్ చేసినా ఒకేలా ఉంటాయి. కానీ రాసే ప్రతి అక్షరానికి ఒక ఫీలింగ్ ఉంటుంది. దాని పై నీ సంతకం ఉంటుంది. నాకెందుకో ఇలా చెప్పడమే బాగుంటుంది. #18PagesFirstLook pic.twitter.com/JE32WXbrdv
— Anupama Parameswaran (@anupamahere) June 1, 2021